ఢిల్లీలోని ఎయిమ్స్ ఝాజర్ క్యాంపస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిర్మించిన విశ్రమ్ సదన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో కార్పొరేట్, ప్రైవేటు, సామాజిక సంస్థలు నిరంతరం కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయని తెలిపారు. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీలోని AIIMS క్యాంపస్‌లో Infosys Foundation నిర్మించిన విశ్రమ్ సదన్‌ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, Vaccination గురించి మాట్లాడారు. వందేళ్లలో అతిపెద్ద మహమ్మారికి మనదేశంలో ఇప్పుడు 100 కోట్ల డోసుల రక్షకాలున్నాయని వివరించారు. India ఇప్పుడు వందకోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసుకున్నదని తెలిపారు. ఇది భారత దేశం, భారత పౌరుల ఘనత అని పొగిడారు. ఇందులో భాగస్వాములైన టీకా తయారీదారులు, వర్కర్లు, టీకా సరఫరాదారులు, ఆరోగ్య రంగ నిపుణులందరికీ Prime Minister కృతజ్ఞతలు తెలిపారు. 

ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన ఝాజర్ క్యాంపస్‌లో నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విశ్రమ్ సదన్ నిర్మించింది. ఈ సదన్‌ను తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎయిమ్స్ ఝాజర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స కోసం దేశం నలుమూలల నుంచి క్యాన్సర్ పేషెంట్లు వస్తుంటారని ప్రధాని చెప్పారు. వారి కోసం విశ్రమ్ సదన్ నిర్మించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భూమి, విద్యుత్, నీరు అందించడానికి ముందుకు వచ్చిన ఎయిమ్స్ ఝాజర్ క్యాంపస్‌ను ప్రశంసించారు. క్యాన్సర్ పేషెంట్లకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన సుధా మూర్తి టీమ్, ఎయిమ్స్ ఝాజర్‌కు రుణపడి ఉంటామని Narendra Modi తెలిపారు. 

Also Read: చారిత్రాత్మక విజయం.. వందకోట్ల మార్క్ ను దాటబోతున్న టీకాడ్రైవ్.. సంబరాలకు అంతా సిద్ధం..

భారత ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయడానికి దేశ కార్పొరేట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, సోషల్ ఆర్గనైజేషన్‌లు నిర్విరామంగా తమ పాత్రను పోషిస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు. దీనికి గొప్ప ఉదాహరణగా ఆయుష్మాన్ భారత్‌ను ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ కింద పేషెంట్లు ఉచితంగా చికిత్స పొందుతున్నారంటే ఆ పథకం సార్థకమైనట్టేనని తెలిపారు. చికిత్సను పేషెంట్లకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సుమారు 400 రకాల క్యాన్సర్ మెడిసిన్ల ధరలు తగ్గించామని వివరించారు.