Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 10న ముంబ‌యిలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. మరో 2 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

Mumbai: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముంబ‌యిలో ఈ నెల 10న వందే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దానికంటేముందు, ఫిబ్రవరి 6న ప్రధాని ఇండియా ఎనర్జీ వీక్ ను ప్రారంభించి కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 

PM Modi will visit Mumbai on February 10, will flag off Vande Bharat Express trains
Author
First Published Feb 3, 2023, 1:13 PM IST

PM Modi will visit Mumbai on February 10: భారత ప్రధాని నరేంద్ర మోడీ మ‌రోసారి మ‌హారాష్ట్రలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఫిబ్రవరి 10న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో ప‌ర్య‌టిస్తార‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. త‌న ప‌ర్య‌ట‌న‌లో బోహ్రా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇక్కడ ఆయన అల్ జామియా తాస్ సైఫియా విద్యాపీఠ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముంబ‌యి పోలీసులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ముంబ‌యిలో ఈ నెల 10న వందే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దానికంటేముందు, ఫిబ్రవరి 6న ప్రధాని ఇండియా ఎనర్జీ వీక్ ను ప్రారంభించి కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రధానమంత్రి షెడ్యూల్ ప్రకారం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి సాయి నగర్ షిర్డీ,  షోలాపూర్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. సమాచారం ప్రకారం, రెండు రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డాయి. ప్రధాని మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత ఇప్పుడు ముంబ‌యి నుంచి మూడు వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. 

రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి ఇప్పటికే ముంబైలోని CST స్టేషన్‌కు చేరుకుంది. మరోవైపు, రైల్వే అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం, రెండవ కొత్త వందే భారత్ రైలు ఫిబ్రవరి 6 న ముంబ‌యికి చేరుకుంటుంది. ముంబ‌యి - షిర్డీ రైలు థాల్ ఘాట్ నుండి ప్రారంభమై 5.25 గంటల్లో 340 కిలో మీట‌ర్లు, ముంబ‌యి - షోలాపూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భోర్ ఘాట్ నుండి నడిచే అవకాశం ఉంది. ఇది 6.35 గంటల్లో సుమారు 455 కిలో మీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది.  

బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించనున్న మోడీ 

ప్ర‌ధాని మోడీ త‌న ముంబ‌యి ప‌ర్య‌ట‌న‌కు ముందు ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించనున్నారు. ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించి, కర్ణాటకలోని బెంగళూరు-తుమకూరులో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారిక‌ సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం మాదవర సమీపంలోని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రధాన మంత్రి ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభిస్తారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023లో ప్రధానమంత్రితో పాటు 30 మందికి పైగా ఇంధన మంత్రులు, 50 మంది CEOలు, 10000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న వివ‌రాల ప్ర‌కారం.. ఇండియా ఎనర్జీ వీక్, G20 ఈవెంట్‌తో సహా బెంగళూరు-తుమకూరులో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 6న కర్ణాటకకు రానున్నారు. ఫిబ్రవరి 6 ఉదయం మాదవర సమీపంలోని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రధాన మంత్రి ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభిస్తారు. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని బిడేరహళ్లి కావల్‌కు మధ్యాహ్నం చేరుకున్న మోడీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. అదే వేదికపై చిక్కనాయకనహళ్లి-తిప్టూరులో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios