ఇండియా ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తాం: ఉగ్ర నేత బషీర్ అహ్మద్

PM Modi will be killed, India will disintegrate': Hafiz Saeed's close aide instigates people to wage jihad during Ramzan
Highlights

హఫీజ్ సయీద్  అనుచరుడి ప్రకటన


న్యూఢిల్లీ:  భారత ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని  పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) ప్రకటించింది.  భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ  
జేయూడీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు  బషీర్ అహ్మద్ ప్రకటించాడు.భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుంది. మోదీని చంపేస్తాం. భారత్, ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు
కావడం తథ్యమని  జేయూడీ నాయకుడు మౌలానా బషీర్ అహ్మద్ పేర్కొన్నట్టుగా  మీడియా ప్రకటించింది.


 శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో  మౌలానా బషీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జేయూడీ  ఇప్పటికీ కశ్మీర్‌లో జీహాద్ నడుపుతున్నాయి. కశ్మీర్‌లోని భారత సైనికులతో
పోరాడుతున్నాయి. భారత్‌ను ముక్కలు చేసి కశ్మీర్‌ను విడిపించేందుకే వారు పోరాడుతున్నారు. వారంతా కశ్మీర్‌లో జీహాదీ జెండా ఎగరేయాలని కోరుతున్నామన్నారు. కశ్మీర్‌లోని యువకులు
జీహాద్‌లో చేరాలనీ స్థానికులు గోధుమలు, డబ్బు ఇవ్వాలని కోరాడు. 
 

loader