పండుగల సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులను వాడకుండా, భారతదేశంలో తయారైన వస్తువులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 

పండుగల సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులను వాడకుండా, భారతదేశంలో తయారైన వస్తువులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా గణేష్ చతుర్థి, దీపావళి, హోలీ వంటి పండుగల సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

గుజరాత్ పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. "గ్రామ వ్యాపారులు ఎంత లాభం వచ్చినా విదేశీ వస్తువులు అమ్మకూడదని ప్రతిజ్ఞ చేయాలి" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. "దురదృష్టవశాత్తూ, గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుంచి వస్తున్నాయి, కళ్ళు సరిగ్గా తెరవని చిన్న కళ్ళ గణేష్ విగ్రహాలు. హోలీ రంగులు కూడా విదేశాల నుంచి వస్తున్నాయి" అని ఆయన అన్నారు.

చైనా నుంచి చౌక వస్తువులు భారత మార్కెట్లలోకి వస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లైట్లు, బాణసంచా, బొమ్మలు, విగ్రహాలు వంటివి చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. పండుగ సీజన్‌లో స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారులకు ఇవి నష్టం కలిగిస్తున్నాయి.

ప్రతి పౌరుడు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. "ఒక పౌరుడిగా, మీకు ఒక పని ఉంది: ఇంటికి వెళ్లి 24 గంటల్లో మీరు ఎన్ని విదేశీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారో జాబితా తయారు చేయండి. మీరు గ్రహించలేరు, కానీ మీరు ఉపయోగించే హెయిర్‌పిన్ లేదా దువ్వెన కూడా విదేశీ ఉత్పత్తి కావచ్చు." అని చెప్పుకొచ్చారు. 

భారతదేశం ఎదుగుదల సమిష్టి ప్రయత్నం మీద ఆధారపడి ఉందని ఆయన అన్నారు. "మనం భారతదేశాన్ని కాపాడాలంటే, భారతదేశాన్ని నిర్మించాలంటే, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే, ఆపరేషన్ సింధూర్ సాయుధ దళాల బాధ్యత మాత్రమే కాదు, 104 కోట్ల మంది భారతీయుల కర్తవ్యం." అని తెలిపారు. 

స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రధాని మోదీ 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.