Asianet News TeluguAsianet News Telugu

సముద్రంపై అతి పొడవైన వంతెన: ప్రారంభించనున్న మోడీ


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  దేశంలోనే సముద్రంపై అత్యంత పొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. 

 PM Modi to unveil Atal Setu, India's longest sea bridge, on Jan 12 lns
Author
First Published Jan 11, 2024, 3:48 PM IST

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఈ నెల  12న  ట్రాన్స్‌హార్బర్  లింక్ బ్రిడ్జిని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.  దేశంలోనే సముద్ర వంతెనగా ఇది  పేరొందింది.

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహరీ వాజ్ పేయ్  గౌరవార్ధం ఈ బ్రిడ్జికి  అటల్ సేతుగా  పేరు పెట్టారు.ఈ నెల 12న మధ్యాహ్నం  మూడున్నర గంటల సమయంలో  ఈ బ్రిడ్జిని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 

అటల్ సేతు  వంతెనను రూ. 17,840 కోట్లతో నిర్మించారు. దీని పొడవు 21.8 కి.మీ. ఆరు లేన్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు.  ఇది సముద్రంలో  16.5 కి.మీ. భూమిపై 5.5 కి.మీ. పొడవు ఉంటుంది.  భారత దేశంలో సముద్రంపై  ఉన్న అత్యంత పొడవైన వంతెన ఇదే.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి  నవీ ముంబై  అంతర్జాతీయ విమానాశ్రాయానికి  త్వరిత కనెక్టివిటీని అందిస్తుంది.  ముంబై నుండి పుణె, గోవాతో పాటు  దక్షిణ భారత దేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.  ముంబై పోర్టు, జవహర్ లాల్ పోర్టు మధ్య కనెక్టివిటిని మెరుగుపరుస్తుందని  అధికారులు తెలిపారు. 

ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం కూడ గణనీయంగా తగ్గనుంది.ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉండడంతో  ఈ ప్రాంతం మధ్య ప్రయాణానికి  రెండు గంటల సమయం పడుతుంది.  అటల్ సేతుపై ప్రయాణం చేస్తే  20 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.  అంతేకాదు నిరంతరం ట్రాఫిక్ జామ్ ల నుండి ఉపశమనం కలగనుంది. ఈ వంతెనపై  100 కి.మీ. వేగంతో  ప్రయాణం చేయవచ్చు.


 మోటార్ బైకులు,  ఆటోరిక్షాలు, ట్రాక్టర్లను ఈ బ్రిడ్జిపై నిషేధించారు.   కార్లు, ట్యాక్సీలు, తేలికపాటి మోటారు వాహనాలు , మినీ బస్సులు, గంటకు 100 కి.మీ. వేగంతో ఈ బ్రిడ్జిపై  ప్రయాణించేందుకు  అధికారులు అనుమతిని ఇచ్చారు. బ్రిడ్జిపైకి ప్రవేశించే సమయంలో, బ్రిడ్జి నుండి బయటకు వచ్చే సమయంలో  గంటకు 40 కి.మీ. వేగంతోనే వాహనాలు నడపాలని  అధికారులు ఆంక్షలు విధించారు. 

మహారాష్ట్రలో  అటల్ సేతు బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పాటు   రూ. 12,700 కోట్ల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను మోడీ ప్రారంభిస్తారు. అనంతరం నవీ ముంబైలో జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios