National Commission for Women: ఈ నెల 31న జాతీయ మహిళా కమిషన్ (NCW) వ్యవస్థాపక దినోత్సవం (30th National Commission for Women (NCW) Foundation Day) కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రసంగించనున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని ప్రసంగించనున్నారు.
National Commission for Women: ఈ నెల 31న జాతీయ మహిళా కమిషన్ (NCW) వ్యవస్థాపక దినోత్సవం (30th National Commission for Women (NCW) Foundation Day) కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రసంగించనున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని ప్రసంగించనున్నారు. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ.. ' షీ ది చేంజ్ మేకర్' (She The Change Maker) థీమ్ తో మహిళా కమిషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమీషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల బోధనా అధ్యాపకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంఘాలు ఈ కార్యక్రమంలో భాగం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా పాల్గొననున్నారు.
ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ 2022 ఏడాదికిగాను తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే తొలి రేడియో ప్రసంగం కావడంతో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా తన మనసులో మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. ఇండియాగేట్ సమీపంలోని అమర్‌జవాన్ జ్యోతిని, నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరున్న అమరవీరుల జ్యోతిని ఇటీవల కలిపేశారని, ఆ ఉద్విగ్న సమయంలో దేశ ప్రజలు, అమరవీరుల కుటుంబాల కండ్లు చెమర్చాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తన ప్రసంగంలో, మోడీ దేశంలోని యువత నుండి కోటి పోస్ట్‌కార్డ్‌లను స్వీకరించడం, ఇటీవల మరణించిన కాలర్‌వాలి పులితో సహా వివిధ అంశాలపై మాట్లాడారు.
కరోనా వైరస్ (Coronavirus) నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు దేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి పూర్తిగా టీకాలు వేశారు. ఈ విషయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ పౌరులకు అభినందనలు తెలిపారు. "మొత్తం వయోజనులలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన మా తోటి పౌరులకు అభినందనలు. టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న వారందరిని చూస్తుంటే గర్వంగా ఉంది" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
