PM Modi: మరోసారి నెహ్రూపై మండిపడ్డ ప్రధాని మోడీ.. ‘భారతీయులపై వారికి విశ్వాసమే లేదు’

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పార్లమెంటులో మరోసారి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి మాట్లాడుతూ విమర్శలు సంధించారు. నెహ్రూకు అసలు భారతీయులపై నమ్మకమే లేదని అన్నారు.
 

pm modi slams jawaharlal nehru and indiragandhi in parliament kms

Nehru: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పార్లమెంటులో మాట్లాడుతూ మరోసారి నెహ్రూపై మండిపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై విరుచుకుపడ్డారు. గతంలో వారు ఇచ్చిన ప్రసంగాల్లోని మాటలను ఉటంకిస్తూ విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలకు భారతీయుల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం లేదని అన్నారు.

‘భారత ప్రజల శక్తియుక్తులను కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువగానే చూసింది. తాము పాలకులం.. మిగిలిన ప్రజలు వారికంటే తక్కువ వారే అనే కోణంలో చూసేవారు’ అని ప్రధాని మోడీ అన్నారు.

లాల్ ఖిల్లాపై నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ‘నెహ్రూ ఇలా అన్నాడు‘యూరోపియన్లు, జపనీస్, చైనీస్, రష్యన్లు లేదా అమెరికన్ల వారిలాగైనా మనం కష్టపడం. ఆ దేశాలు, జాతులు ఉన్నట్టుండి ఏదో ఇంద్రజాలంతో సంపన్నమైనాయని అనుకోవద్దు. వారి తెలివితేటలు, కష్టపడి పని చేయడం ద్వారానే విజయాలు సాధించారు’ భారతీయులు బద్దకస్తులని, వారికి మెదడు పని చేయదని నెహ్రూ ఆలోచించేవాడని ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఆయన భారతీయుల శక్తి సామర్థ్యాలను విశ్వసించలేదు’ అని ప్రధాని మోడీ అన్నారు.

Also Read: కాశీ, మథుర ఇచ్చేస్తే వేరే మసీదులను అడగం: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కోశాధికారి

ఇందిరా గాంధీ కూడా భారతీయులను అలాగే చూసేదని ప్రధాని మోడీ అన్నారు.‘‘ఎర్రకోటపై ఇందిరా గాంధీ ఇలా అన్నారు ‘ఒక మంచి కార్యం దాదాపు కావొచ్చినప్పుడు దురదృష్టవశాత్తు మనం అలసత్వంలో మునిగిపోతాం. ఏదైనా ఒక ఆటంకం వచ్చినప్పుడు ఆశను కోల్పోతాం. కొన్నిసార్లు ఈ దేశం మొత్తంగా ఓటమిని అంగీకరించిందా? అనిపిస్తుంది’ ఇప్పుడు కాంగ్రెస్‌ను చూడండి. ఇందిరాగాంధీ భారత పౌరులను తక్కువ అంచనా వేసిందని చెప్పొచ్చు. కానీ, కాంగ్రెస్ విషయంలో మాత్రం సరిగ్గానే మాట్లాడింది’ అని ప్రధాని అన్నారు.

భారతీయుల గురించి కాంగ్రెస్ రాచ కుటుంబానికి గల ఆలోచనా దృక్పథం ఇదీ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కానీ, తనకు దేశ పౌరులపై అపార విశ్వాసం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios