Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామ మందిరం: నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై పూల వర్షం కురిపించిన మోడీ

అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.
 

  PM Modi Showers Flowers Petals On Ram Temple Construction Crew lns
Author
First Published Jan 22, 2024, 4:50 PM IST


న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, సిబ్బందిపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పూల వర్షం కురిపించారు.సోమవారం నాడు నిర్ణీత ముహుర్తానికి అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో  రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది.ఈ విగ్రహా ప్రాణ ప్రతిష్ట తర్వాత  సభ నిర్వహించారు.ఈ సభ పూర్తైన తర్వాత  రామాలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, సిబ్బందిపై   పూల వర్షం కురిపించారు మోడీ.

క్రీమ్ కలర్ కుర్తా ఫైజామా ధరించిన మోడీ  ఓ బుట్టలో  పూలను తీసుకొని  రామాలయ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై చల్లారు.రామాలయంలో  జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో  దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మంది  హాజరయ్యారు.  సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు ఇందులో ఉన్నారు.

గర్బగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత నిర్వహించిన సభలో  మోడీ ప్రసంగించారు.  రాముడు మళ్లీ వచ్చాడని ఆయన  చెప్పారు.  అయోధ్యలో రాముడి దర్శనం సామాన్య భక్తులకు రేపటి నుండి కల్పించనున్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు.  రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ప్రధాన పూజా కార్యక్రమాలు పూర్తైన  తర్వాత రాముడి విగ్రహాం ముందు మోడీ సాష్టాంగ ప్రమాణం చేశారు. 

 

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాకు హాఫ్ డే సెలవు ప్రకటించింది.  సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు మూసివేశా

also read:మోడీ ఓ తపస్వి: అయోధ్యలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట తర్వాత మోహన్ భగవత్

రామ మందిరం  సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. దీని తూర్పు -పడమర పొడవు  380 అడుగులు, వెడల్పు 250 అడుగులు.  ఎత్తు 161 అడుగులు. ఎత్తు  161 అడుగులు. ఈ ఆలయానికి  392 స్థంబాల మద్దతుంది.  44 తలుపులు ఏర్పాటు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios