Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్తంగా 56 చోట్ల సీబీఐ సోదాలు.. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌‌ కేసులో విచారణ..

దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 56 చోట్ల సీబీఐ తనిఖీలు చేపట్టింది. 

CBI raids 56 locations related to circulation of child sexual abuse material case
Author
First Published Sep 24, 2022, 12:22 PM IST

దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 56 చోట్ల సీబీఐ తనిఖీలు చేపట్టింది. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ను చెలామణి చేస్తున్న రెండు కేసులకు సంబంధించి 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని.. 56చోట్ల దాడులు చేసినట్టుగా సీబీఐ అధికారులు చెప్పినట్టుగా పీటీఐ రిపోర్ట్ చేసింది. సింగపూర్ ద్వారా న్యూజిలాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ షేర్ చేసిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరుపుతున్నట్టుగా సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ఇందుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios