PM Modi US Visit:ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశమై ఉగ్రవాదంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు. 

PM Modi US Visit: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు (గురువారం) వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం తరువాత ప్రధాని మోడీ, బిడెన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతదేశంలోని మానవ హక్కులు,మైనారిటీల గురించి ప్రధాని మోడీని ప్రశ్నించగా.. అందుకు ధీటైన సమాధానమిచ్చారు.

ప్రధాని మోదీ బదులిస్తూ..'భారత్‌లో ప్రజాస్వామ్యం ఉంది. ఇరుదేశాల( భారత్ అమెరికా) డీఎన్ఏ (DNA)లోనే ప్రజాస్వామ్యం ఉంది, తాము ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము. ప్రజాస్వామ్య విలువల ఆధారంగా రూపొందించిన రాజ్యాంగం ఆధారంగా మా ప్రభుత్వం నడుస్తోంది. కుల, మత, లింగ ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేదు'. అని అన్నారు. మానవ విలువలు, మానవ హక్కులు లేకపోతే ప్రజాస్వామ్యం లేదని ప్రధాని మోదీ అన్నారు.సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ (అందరి మద్దతు, అందరి విశ్వాసం,అందరి అభివృద్ధి)" అనే నినాదాన్ని ఉటంకించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తీవ్రవాద అంశాన్ని లేవనెత్తారు.

Scroll to load tweet…