Asianet News TeluguAsianet News Telugu

FIFA World Cup 2022 : మెస్సీ మ్యాజిక్‌పై ప్రధాని మోదీ ట్వీట్.. అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటని...

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. "అత్యంత ఉత్కంఠభరితమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఒకటిగా గుర్తుండిపోతుంది" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

PM Modi On Messi Magic In FIFA World Cup 2022
Author
First Published Dec 19, 2022, 8:03 AM IST

న్యూఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన అర్జెంటీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఒకటిగా గుర్తుండిపోతుందని అన్నారు. అర్జెంటీనా ఈ రోజు పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి మూడోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో ఎక్స్ ట్రా టైం తర్వాత 3-3తో ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ చేయగా, ఫ్రాన్స్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాప్పే హ్యాట్రిక్ సాధించాడు.

భారత ప్రధాని కూడా ఫ్రాన్స్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనను ప్రశంసించారు. జట్టు తమ నైపుణ్యం, క్రీడాస్ఫూర్తితో ఫుట్‌బాల్ అభిమానులను ఆనందపరిచిందని చెప్పారు. ఇది మెస్సీకి ఐదో గేమ్, అంతేకాదు ప్రపంచ కప్‌ అందుకోవడానికి అతనికి ఉన్న ఆఖరి అవకాశం. అతని కెరీర్ మొత్తంలో ఈ ట్రోఫీ మెస్సీని అందకుండా ఊరిస్తూనే ఉంది. మార్క్యూ టోర్నమెంట్‌లో అర్జెంటీనా గెలుపొందడంతో భారత్ అంతటా మెస్సీ అభిమానులు పటాకులు పేల్చారు. ఆనందంతో విజిల్స్ ఊది, కేకలు వేశారు.

FIFA World Cup 2022: రెండు గోల్డెన్ బాల్ అవార్డులను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా మెస్సీ రికార్డు

ఈ విజయం 35 ఏళ్ల వయసులో, డిగో మారడోనా ఎలా తన కెరీర్ ముంగించారో ఆ సందర్బాన్ని మెస్సీ గెలుపు మరోసారి చేసింది. టోర్నమెంట్‌లో ఎనిమిది గోల్‌లతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మాబాప్పే కూడా బాగా ఆడినా ఇది మెస్సీ టోర్నమెంట్‌గా గుర్తుండిపోతుంది.

"వామోస్," అభిమానులు, అర్జెంటీనా జెర్సీని ధరించి, కేరళలోని కొన్ని ప్రాంతాలలో జంపింగులు చేశారు. తమ ఆనందాన్ని ఆపుకోలేక డ్యాన్స్ లు చేస్తూ, కేకలు వేస్తూ.. అరుస్తూ కనిపించారు. కేరళ రాష్ట్ర రాజధాని అయినా.. తిరువనంతపురం ఉత్తరాన ఉన్న కొచ్చి ఓడరేవు నగరం అయినా.. లేదా మలప్పురం అయినా.. దక్షిణ అమెరికా జట్టు, లియోనెల్ మెస్సీ అభిమానులందరూ ఇలాగే సంబరాల్లో మునిగిపోవడం కనిపిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios