Asianet News TeluguAsianet News Telugu

ఆదిశంకరాచార్యుల సూత్రాలు నేటికి వర్తిస్తాయి: కేదార్‌నాథ్ లో మోడీ ప్రత్యేక పూజలు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదార్‌నాథ్ ఆలయంలో చేపట్టిన రూ. 130 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన పనులను మోడీ సమీక్షించనున్నారు.
 

PM Modi offers prayers at Kedarnath temple
Author
New Delhi, First Published Nov 5, 2021, 9:18 AM IST

న్యూఢిల్లీ :అన్ని మఠాలు, 12 జ్యోతిర్లింగాలు మనల్ని ఆశీర్వదిస్తున్నాయని ప్రధాని  నరేంద్ర మోడీ  చెప్పారుప్రధానమంత్రి Narendra Modi శుక్రవారం నాడు ఉత్తరాఖండ్‌లోని  Kedarnath temple సందర్శించారు.ఇవాళ ఉదయం కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకొన్న ప్రధానికి   ఘనంగా స్వాగతం పలికారు.ఇవాళ ఉదయం డెహ్రాడూన్ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఆయన మంత్రివర్గ సహచరులు  సుబోధ్ ఉనియాల్, గణేష్ జోషి, ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌చంద్ అగర్వాల్ లు ప్రధానికి స్వాగతం పలికారు.

also read:రేపు కేదార్‌‌నాథ్‌కు ప్రధాని మోడీ.. పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

ఈ సంద్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.దీపావళి సందర్భంగా నిన్న తాను సైనికులతో కలిసి ఉన్నానని ఆయన చెప్పారు.సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వంగా ఉందని మోడీ చెప్పారు.దేశంలోని 130 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలను తీసుకొని జవాన్ల వద్దకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని అనుభవాలను మనం మాటలతో వ్యక్తీకరించలేమని మోడీ చెప్పారు. ఇవాళ ఇక్కడ జరిగిన  ఆది శంకరాచార్య సమాధి ప్రారంబోత్సవానికి మీరంతా సాక్షులని చెప్పారు. 

ఇవాళ ఇక్కడ జరిగిన  ఆది శంకరాచార్య సమాధి ప్రారంబోత్సవానికి మీరంతా సాక్షులని చెప్పారు.  2013 వరదల తర్వాత కేదార్‌నాథ్ ను తిరిగి అభివృద్ది చేయవచ్చా అని ప్రజలు ఆలోచించారు. కానీ మళ్లీ అభివృద్ది చెందుతుందని తనలోని ఒక స్వరం ఎప్పుడూ చెబుతుందని ప్రధాని తెలిపారు.

"

కొత్త ప్రాజెక్టులకు పునాది వేయడమే కాకుండా భక్తుల భద్రతను పెంచేందుకు దేవభూమి అభివృద్దికి గేట్ వే తెరవడానికి ఇది శుభ దినమని మోడీ అభిప్రాయపడ్డారు. తాను క్రమం తప్పకుండా కేదార్‌నాథ్ పునర్నిర్మాణ పనులను క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్టుగా ప్రధాని గుర్తు చేశారు. డ్రోన్ పుటేజీ ద్వారా ఇక్కడ జరుగుతున్న పలు పనుల పురోగతిని సమీక్షించానన్నారు. ఈ పనులకు మార్గదర్శకత్వం వహించిన ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలు  చెబుతున్నట్టుగా మోడీ  ప్రకటించారు

.ఆది శంకరాచార్యుల సూత్రాలు నేటికి వర్తిస్తాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.కేదార్‌నాథ్ ను సందర్శించే ప్రతి ఒక్కరూ తమతో పాటు కొత్త స్పూర్తిని పొందుతారన్నారు మోడీ.భారతీయ తత్వశాస్త్రం, మానవ సంక్షేమం గురించి మాట్లాడుతుంది. జీవితాన్ని సమగ్ర పద్దతిలో చూస్తోందన్నారు. ఈ సత్యాన్ని సమాజానికి చెప్పేందుకు ఆదిశంకరాచార్యులు కృషి చేశారని మోడీ గుర్తు చేశారు.

ఆది గురు శంకరాచార్యుల సమాధి వద్ద ఆయన విగ్రహం ముందు కూర్చున్న అనుభూతిని వర్ణించడానికి మాటలు లేవన్నారు.అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారు. ఇటీవల అక్కడ దిపోత్సవం ఘనంగా జరిగిందన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు దేశం ఉన్నత లక్ష్యాలను కలిగి ఉందన్నారు మోడీ. 

రానున్న రోజుల్లో ఉత్తరాఖండ్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందనే ఆకాంక్షను ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్ధం హేమకుంద్ సాహెబ్ సమీపంలోని చార్‌థామ్‌లు, రోప్‌వేకి రోడ్డు కనెక్టివిటితో సహా ఉత్తరాఖండ్ లో మౌళిక వసతుల కోసం ప్రణాళికలు చేసినట్టుగా ప్రధాని చెప్పారు. గత 100 ఏళ్లలో కంటే రానున్న 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తారని మోడీ అభిప్రాయపడ్డారు.
 

కేదార్‌నాధ్ ఆలయంలో మోడీ రుద్రాభిషేకం

కేదార్‌నాథ్  ఆలయంలో  ప్రధాని మోడీ  కేదార్‌నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు.  అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.2013లో ఉత్తరాఖండ్ లో భారీ వరదలు వచ్చాయి.ఈ వరదల కారణంగా Adi Shankaracharya  సమాధి ధ్వంసమైంది. ఈ సమాధిని పునర్నిర్మించారు.ప్రధాని నరేంద్రమోడీ.35 టన్నుల బరువున్న ఆది శంకరాచార్యుల విగ్రహన్ని ఆవిష్కరించారు..క్టోడైట్ శిలలతో ఆదిశంకరాచార్య విగ్రహన్ని తయారు చేశారు.

 

ఈ సమాధి వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.2013లో వరదల కారణంగా ఉత్తరాఖండ్ లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సుమారు రూ. 130 కోట్ల అభివృద్ది పనులను చేపట్టారు. ఈ పనులను ప్రధాని సమీక్షిస్తారు.

ఈ ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించడం ఇది ఐదోసారి.ప్రధాని కేదార్‌నాథ్‌ పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios