Asianet News TeluguAsianet News Telugu

రేపు కేదార్‌‌నాథ్‌కు ప్రధాని మోడీ.. పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ (Pm narendra modi) రేపు కేదార్‌నాథ్‌లో (Kedarnath)పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అనంతరం కొత్తగా నిర్మించిన ఆదిశంకరాచార్య సమాధిని (adi shankaracharya samadhi) , విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు

PM Narendra Modi To Visit Kedarnath Tomorrow Inaugurate Infra Projects
Author
New Delhi, First Published Nov 4, 2021, 8:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రధాని నరేంద్ర మోడీ (Pm narendra modi) రేపు కేదార్‌నాథ్‌లో (Kedarnath)పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అనంతరం కొత్తగా నిర్మించిన ఆదిశంకరాచార్య సమాధిని (adi shankaracharya samadhi) , విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే 250 కోట్లతో చేపడుతున్న కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును.. కేదార్‌ నాథ్‌ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారు. 2013 లో వచ్చిన భారీ వరదలకు (kedarnath flood 2013) ఆది శంకరాచార్య సమాధితో పాటు కేదార్‌నాథ్‌ లో పలు కట్టడాలు ధ్వంససమవడంతో వాటిని పునర్నిర్మిస్తున్నారు. 

కేదార్‌నాథ్‌లోని ఆదిశంకరాచార్యుడి స‌మాధి 2013లో వ‌చ్చిన భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల ధ్వంస‌మైంది. 2013నాటి వరదల్లో దెబ్బతిన్న ఈ సమాధిని మోదీ పర్యవేక్షణలో పునర్నిర్మించారు. కాగా, మైసూరులో తయారుచేయబడిన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని చినూక్ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Also Read:130 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలు తెచ్చా: నౌషీరాలో ఆర్మీ జవాన్లతో మోడీ దీపావళి వేడుకలు

ఇక, కేదార్‌నాథ్ పర్యటనలో భాగంగా సరస్వతి ఆస్థా పథ్ (విశ్వాస మార్గం) వెంబడి జరుగుతున్న పనులను ప్రధాని సమీక్షిస్తారు. సరస్వతి రిటెయినింగ్ వాల్ ఆస్థా పథ్, స్నాన ఘట్టాలు, మందాకిని రిటెయినింగ్ వాల్ ఆస్థా పథ్, తీర్థ పురోహితుల ఇళ్ళు, మందాకిని నదిపై గరుడ్ ఛట్టి వంతెన సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. రూ.130 కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు. అలాగే  మ‌రో రూ.180 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మించ‌త‌ల‌పెట్టిన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ప్రధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 

కాగా..  Jammu Kashmir లోని Nowshera, Rajouri లలో ఆర్మీ జవాన్లతో ప్రధాని నరేంద్ర మోడీ  గురువారం నాడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ప్రతి Diwali ని మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో గడుపుతున్న విషయాన్ని ఆయన  గుర్తు చేసుకొన్నారు. భద్రతా బలగాలే తన కుటుంబమని మోడీ తెలిపారు.మన జవాన్లు శతృవులకు ధీటైన జవాబు ఇస్తున్నారని ప్రధాని  ప్రశంసించారు.సైనికులతో దీపావళిని జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మీ సామర్ధ్యం, బలం  దేశానికి శాంతి, భద్రతను నిర్ధారిస్తున్నాయని  చెప్పారు మోడీ..మీ వల్లే  పౌరులు పండుగలను జరుపుకొంటున్నారని ప్రధాని తెలిపారు.

'మా భారతి'కి 'సురక్ష కవాచ్' మన సైనికులు అని ఆయన అభిప్రాయపడ్డారు. మీ అందరి వల్లే మన దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారని చెప్పారు. పండుగల సమయంలో ఆనందంగా ఉంటారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఈ బ్రిగేడ్ పోషించిన పాత్ర ప్రతి భారతయుడిని గర్వంతో నింపుతుందన్నారు. గతంలో భదత్రా దళాలకు  రక్షణ పరికరాలను అందించడానికి సంవత్సరాలు పట్టేదని ఆయన గుర్తు చేశారు. కానీ రక్షణ రంగంలో స్వావలంభన కోసం నిబద్దతతో పాత పద్దతులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.మారుతున్న ప్రపంచం, యుద్ధ విధానానికి అనుగుణంగా మనం కూడా మన సైనిక సామర్ధ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని  మోడీ అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios