జమ్మూ కాశ్మీర్ సిగలో మరో అద్భుతం ... Z Morh సొరంగమార్గం ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ(సోమవారం) జమ్మూ కాశ్మీర్ లో అత్యంత కీలకమైన ఓ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. సోనామార్గ్‌లో జెడ్ మోర్ సొరంగం ఓపెనింగ్ తో పరిస్థితి ఎలా మారనుందో తెలుసా? 

PM Modi Inaugurates Z Morh Tunnel in Sonamarg Boosting Tourism and Connectivity AKP

శ్రీనగర్  : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ లోని సోనమార్గ్‌లో నిర్మించిన Z Morh Tunnel ను ప్రారంభించారు. గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగం రక్షణాపరంగా వ్యూహాత్మకమైనదే కాదు ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. దీని ద్వారా లడఖ్‌కు సైన్యం చేరుకోవడం చాలా సులభం అవుతుంది. దీంతోపాటు సోనామార్గ్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పర్యాటకం పెరుగుతుంది. 

జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం తీవ్రమైన చలి ఉంది. దీంతో ప్రధాని మోదీ వెచ్చని దుస్తులు ధరించి కనిపించారు. హూడీ జాకెట్,చేతి గ్లౌజులు ధరించి కళ్లకు నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం తర్వాత నరేంద్ర మోడీ పూలతో అలంకరించిన వాహనం ఎక్కి సొరంగంలో ప్రయాణించారు.

6.5 కిలోమీటర్ల పొడవైన జెడ్ మోర్ సొరంగం శ్రీనగర్, సోనామార్గ్ మధ్య ఇక కాలంతో పనిలేకుండా రాకపోకలకు అవకాశం కల్పిస్తుంది. లేదంటో శీతాకాలంలో భారీగా మంచు కురిసే సమయాల్లో ఈ మార్గం మూసివేయబడేది. ఇలా నెలల తరబడి ఈ మార్గం మూసివేసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి రావడంతో ఏడాది పొడవునా సోనామార్గ్‌కు సులభంగా చేరుకోవచ్చు. సోనమార్గ్ మంచు క్రీడలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కొత్త సొరంగం అక్కడికి చేరుకోవడం సులభతరం చేస్తుంది.

 

ప్రధానమంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ప్రతిష్టాత్మక టన్నెల్ ప్రారంబోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ సొరంగం నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కూడా కలిసారు.

రూ.2,700 కోట్లతో జెడ్ మోర్ సొరంగం నిర్మాణం

జెడ్ మోర్ సొరంగం ప్రాజెక్ట్ పొడవు దాదాపు 12 కిలోమీటర్లు... కేవలం సొరంగమే 6.5 కిలోమీటర్లు వుంటుంది. దీని నిర్మాణానికి 2,700 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇది సముద్ర మట్టం నుండి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. సోనామార్గ్ సొరంగం లెహ్ వెళ్లే మార్గంలో శ్రీనగర్, సోనామార్గ్ మధ్య వుంటుంది. ఈ టన్నెల్ అందుబాటులోకి వచ్చిందికాబట్టి ఇక దేశ రక్షణలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన లడఖ్ ప్రాంతానికి చేరుకోవడం సులభం అవుతుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios