Asianet News TeluguAsianet News Telugu

దేశంలో అతి పెద్ద తీగల వంతెన: ప్రారంభించిన మోడీ


దేశంలోని అతి పొడవైన బ్రిడ్జిని ప్రధానమంత్రి మోడీ ఇవాళ ప్రారంభించారు.
 

 PM Modi Inaugurates 'Sudarshan Setu', India's Longest Cable-Stayed Bridge  lns
Author
First Published Feb 25, 2024, 11:42 AM IST

న్యూఢిల్లీ: దేశంలో అతి పొడవైన తీగల వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ప్రారంభించారు.ఓఖా, బేట్ ద్వీపాలను కలుపుతూ  సుదర్శన్ సేతు బ్రిడ్జిని నిర్మించారు. రూ. 979 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు.  2017 అక్టోబర్ మాసంలో  ఈ బ్రిడ్జి పనులకు  మోడీ శంకుస్థాపన చేశారు.పాత,కొత్త ద్వారకాలను కలిపేందుకు  ఈ  తీగల వంతెన ఉపయోగపడుతుంది.

also read:సోషల్ మీడియాలో దుష్ప్రచారం: సైబరాబాద్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

ఈ తీగల వంతెన నాలుగు లేన్లుగా ఉంది.  ఈ తీగెల వంతెన 27.20 మీటర్ల  వెడల్పు ఉంటుంది.  ప్రతి వైపు  2.50 మీటర్ల వెడల్పుతో  ఫుట్ ఫాత్ లను కలిగి ఉన్నాయి. సుదర్శన్ సేతు ప్రత్యేక డిజైన్ కలిగి ఉంది.  ఈ బ్రిడ్జికి రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలను ఏర్పాటు చేశారు.

also read:నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్

 

సిగ్నేచర్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనకు సుదర్శన్ సేతు లేదా  సుదర్శన్ బ్రిడ్జిగా పేరు పెట్టారు.  బేట్ ద్వారక అనేది ఓఖా పోర్ట్ సమీపంలో  ఉన్న ఒక ద్వీపం. ఇది ద్వారకా పట్టణానికి దాదాపు 30 కి.మీ దూరంలో ఉంది.  ఇక్కడే శ్రీకృష్ణుడి ప్రసిద్ద ద్వారకాధీష్ ఆలయం ఉంది.

also read:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం: అమ్మమ్మను మనవడు ఏం చేశాడంటే?

ఈ వంతెనను ప్రారంభించే ముందు  ప్రధాని నరేంద్ర మోడీ ద్వారకాధీష్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. రాజ్ కోట్ లో  ఎయిమ్స్ ను  ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నాం ప్రారంభించనున్నారు. రాజ్ కోట్ తో పాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలో కూడ మరో నాలుగు ఎయిమ్స్ లను కూడ ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.రాజ్‌కోట్‌లోని ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేంద్రం రూ. 6,300 కోట్లతో నిర్మించింది.రాజ్ కోట్ లో  ఇవాళ సాయంత్రం  రోడ్ షో లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios