నడిరోడ్డుపై  ఓ వ్యక్తి మహిళను వేధించారు. అయితే  అతనికి  దారిపోయేవారు బుద్ది చెప్పారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూఢిల్లీ:చర్యకు ప్రతి చర్య ఉంటుందని మనం తరచుగా వినే ఉంటాం. అయితే ఓ మహిళను నడిరోడ్డుపై వేధింపులకు గురిచేసిన వ్యక్తిని రోడ్డున వెళ్లే ప్రయాణీకులు చితకబాదారు. ఈ ఘటనను కొందరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

also read:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం: అమ్మమ్మను మనవడు ఏం చేశాడంటే?

Scroll to load tweet…
Scroll to load tweet…

ఓ మహిళ ఒంటరిగా వీధిలో వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఆ వ్యక్తి నుండి తప్పించుకొనేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తుంది. అయితే అదే సమయంలో ఓ బస్సు అదే దారి గుండా వెళ్తుంది.

also read:బుల్లెట్‌ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?

Scroll to load tweet…

ఈ బస్సులోని ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి నిందితుడికి దేహశుద్ది చేశారు. బస్సులోని ప్రయాణీకుల సహయంతో బాధితురాలు అక్కడి నుండి సురక్షితంగా బయటపడింది.

Scroll to load tweet…

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళలను వేధించిన వ్యక్తికి దేహశుద్ది చేయడాన్ని సమర్ధించారు. ఒక చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.గుర్తు తెలియని మహిళను రక్షించేందుకు ప్రయాణీకులు రావడాన్ని కొందరు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. మహిళను కాపాడేందుకు వచ్చిన వారిని అభినందించారు. మహిళను వేధించిన వ్యక్తికి మంచి గుణపాఠం చెప్పారని మరొకరు వ్యాఖ్యానించారు.