Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో కొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

Bengaluru: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తన బెంగళూరు పర్యటనలో  భాగంగా కొత్త మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఇత‌ర పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.
 

PM Modi inaugurates new metro rail line in Bengaluru RMA
Author
First Published Mar 25, 2023, 4:37 PM IST

PM Modi inaugurated a new metro line Karnataka:  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న క‌ర్నాట‌క ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొత్త మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఇత‌ర పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. బెంగ‌ళూరులో మొత్తం 12 స్టేషన్లతో కూడిన 13.71 కిలోమీటర్ల వైట్ ఫీల్డ్.. కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. ఈ విభాగం బైయప్పనహళ్లి నుండి వైట్ ఫీల్డ్ స్టేషన్ వరకు పనిచేసే ఈస్ట్-వెస్ట్ కారిడార్ (పర్పుల్ లైన్) తూర్పు పొడిగింపుగా అధికారులు పేర్కొన్నారు.

 

ప్ర‌ధాని మోడీ  మెట్రోలో ప్రయాణించి.. బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది, మెట్రో నిర్మాణ కార్మికులు, విద్యార్థులతో సహా వివిధ వర్గాల ప్రజలతో సంభాషించారు. ప్రధాని టికెట్ కౌంటర్ వరకు నడిచి, ఆపై మెట్రో రైలు ఎక్కేందుకు సాధారణ ప్రయాణీకుడిలాగానే ప్రవేశ ద్వారం గుండా వెళ్లారు. ఆయన వెంట కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు ఉన్నారు.

 

 

నిర్మాణంలో ఉన్న 15.81 కిలోమీటర్ల విస్తరణలో కేఆర్ పురం నుంచి వైట్ ఫీల్డ్ వరకు 13.71 కిలోమీటర్ల విభాగాన్ని శనివారం ప్రారంభించామనీ, దీనివల్ల ఈ మార్గంలో ప్రయాణ సమయం 40 శాతం తగ్గుతుందని, రోడ్డు ట్రాఫిక్ రద్దీ ప్రభావం తగ్గుతుందని అధికారులు తెలిపారు. 

కాగా, భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఇత‌ర పార్టీల‌పై ప్రధాని మోడీ విమ‌ర్శ‌లు గుప్పించారు. జకీయ స్వార్థం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు భాషలపై ఆటలాడుకుంటున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం కావాలని బీజేపీ ప్రభుత్వం నొక్కి చెబుతోందని అన్నారు. సబ్ కా ప్రయాస్ తో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా పయనిస్తోందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios