Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ లో పాక్ పై భారత్ విజయం.. అద్భుత ప్రదర్శన అంటూ మోదీ ప్రశంసలు..

ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ కూడా భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారంటూ ట్వీట్ చేశారు. 

PM Modi congratulates team India's victory over Pakistan in Asia Cup
Author
First Published Aug 29, 2022, 7:17 AM IST

ఢిల్లీ : ఆసియా కప్లో భాగంగా భారత్ చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారీ విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘భారత్ ఈ రోజు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. గొప్ప నైపుణ్యం కనబరిచింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. దాయాదుల సమరంలో భాగంగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 147 పరుగులకే ప్రత్యర్థి జట్టును పరిమితం చేసింది.  ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. 

మ్యాచ్ మొత్తం ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో హార్థిక్ పాండ్య (33 నాటౌట్) సిక్స్తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.భారత జట్టులో విరాట్ కోహ్లీ (35), రవీంద్ర జడేజా(35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బౌలర్లలో  భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బ తీశారు. ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ట్వంటీ-20 లో భాగంగా పాకిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి విజయం సాధించింది. 

Asia Cup: బదులు తీరింది.. ఉత్కంఠ అదిరింది.. పాక్ పై పోరులో టీమిండియాదే విక్టరీ..

కాగా ఆటలో అడుగడుగునా ఉత్కంఠ నడిచింది. లక్ష్యం స్వల్పంగానే ఉన్నా.. మొదటి ఓవర్లోనే భారత్ కు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే  ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నసీమ్ షా వేసిన తొలి ఓవర్  రెండో బంతిని వికెట్ల మీదకు ఆడుకునే పెవిలియన్కు చేరాడు.  అదే  ఓవర్ లో నాలుగో బంతికి వన్ టౌన్ లో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35, 3ఫోర్లు, 1 సిక్సర్) కూడా అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.  ఆ తర్వాత కోహ్లీ చెలరేగిపోయాడు. 

దహాని వేసిన రెండో ఓవర్లో  ఫోర్ పుట్టిన కోహ్లీ.. రౌఫ్ వేసిన నాలుగో ఓవర్లో  సిక్సర్ బాదాడు. rohit sharma (18 బంతుల్లో 12) నెమ్మదిగా ఆడినా.. కోహ్లీ దూకుడు కొనసాగించాడు. దీంతో ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 49 పరుగులు జోడించారు. అలా క్రీజ్లో కుదురుకుంటున్న ఈ జోడిని మహ్మద్ నవాజ్ విడదీశాడు. నవాజ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని సిక్సర్ బాది అదే ఓవర్లో ఆరో బంతికి ఇప్థీకర్ కు క్యాచ్ ఇచ్చి వెనక్కి తిరిగాడు. తన తర్వాతి ఓవర్లో ధాటిగా ఆడుతున్న కోహ్లీని. అవుట్ చేశాడు దీంతో భారత్ కష్టాల్లో పడింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios