Cabinet Meeting: సాయంత్రం కేంద్ర క్యాబినెట్ భేటీకి ప్రధాని మోడీ నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీకి పిలుపు ఇచ్చారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో క్యాబినెట్ సమావేశానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్రమంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ రోజు సాయంత్రం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్న సందర్భంలో ఆయన క్యాబినెట్ భేటీకి పిలుపు ఇవ్వడం గమనార్హం.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ముఖ్యమైన బిల్లులపై ఈ రోజు సాయంత్రం నాటి క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం పార్లమెంటు అనెక్సీ బిల్డింగ్‌లో జరగనున్నట్టు సమాచారం.
Also Read: ప్రజలు సంబరాలు చేసుకోలేదు.. పార్లమెంట్‌లో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు.