Asianet News TeluguAsianet News Telugu

ప్రజలు సంబరాలు చేసుకోలేదు.. పార్లమెంట్‌లో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన మోదీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాన్ని ప్రస్తావించారు.

parliament special session pm modi comments on andhra pradesh and telangana Bifurcation ksm
Author
First Published Sep 18, 2023, 12:28 PM IST | Last Updated Sep 18, 2023, 12:42 PM IST

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల వేళ లోక్‌సభలో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో పార్లమెంట్‌లో భవనంతో ఉన్న అనుబంధం, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, మాజీ ప్రధానులు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రగతి శీల కార్యక్రమాల గురించి మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజ తీరును ప్రస్తావిస్తూ యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని చెప్పారు. తెలంగాణ  ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని అన్నారు.  అయితే యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదని మోదీ అన్నారు. విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రజలు అసంతృప్తికి గురయ్యారని మోదీ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోలేదని అన్నారు. వాజ్‌పేయి హయంలో కూడా కొత్త  రాష్ట్రాలను ఏర్పాటు జరిగిందని.. అప్పుడు విడిపోయిన రాష్ట్రాలు సంబరాలు చేసుకున్నాయని అన్నారు.  ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల ఏపీ, తెలంగాణ  విభజన జరగలేదని అన్నారు. 


ఇక, అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పలు చారిత్రాత్మక నిర్ణయాలు, పరిష్కారాలను ఈ సభలో  జరిగాయని చెప్పారు. ఆర్టికల్ 370 (రద్దు) దాని వల్లే సాధ్యమైందని సభ ఎప్పుడూ గర్వంగా చెబుతుందని అన్నారు. ఇక్కడ కూడా జీఎస్టీ పాస్ అయిందని చెప్పారు. ఈ సభ సాక్షిగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు దేశంలో మొదటిసారిగా ఎలాంటి వివాదం లేకుండా విజయవంతంగా అనుమతించబడ్డాయని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios