రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, అధికారులు తీరుకు వ్యతిరేకంగా రెజర్లు రెండు రోజుల నుంచి ఢిల్లీ నిరసన చేపడుతున్నారు. వీరి నిరసనకు మద్దతు ఇవ్వడానికి సీపీఎం నేత బృందా కారత్ అక్కడి చేరుకుంది. అయితే దీనిని రాజకీయం చేయొద్దని ఆమెను రెజర్లు కోరారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోచ్‌లు, అధికారులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజర్లు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నేడు కూడా ఈ ఆందోళనలో దాదాపు 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. అయితే ఈ నిరసన వేధిక వద్దకు సీపీఐ(ఎం) నేతలు చేరుకున్నారు. కానీ రాజకీయ నాయకులు ఇందులో కలుగజేసుకోవద్దని రెజర్లు కోరారు.
గత ప్రభుత్వాలు కుల, మతాలను సమస్యలుగా మార్చాయి.. మేము అభివృద్ధిని తీసుకొచ్చాం: కర్ణాటకలో ప్రధాని మోడీ
రెజర్లు చేపడుతున్న నిరసనలకు ఒలింపియన్లు, స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా నాయకత్వం వహిస్తున్నారు. అయితే మద్దతుగా సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కారత్ జంతర్ మంతర్ వద్దకు వచ్చారు. స్టేజీపైకి ఎక్కారు. అయితే ఆమెను స్టేజీపై నుంచి దిగిపోవాలని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా చేతులు జోడించి అభ్యర్థించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ నీచే ఉతర్ జైయే ప్లీజ్ (దయచేసి దిగిపోండి).. మేడమ్, దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దని మేము మిమ్మల్ని కోరుతున్నాము’’ అని ఆయన అన్నారు.
దీంతో ఆమె స్టేజీ నుంచి దిగిపోయింది. ఈ విషయంపై బృందా కారత్ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడారు. ఎవరిపైన లైంగిక వేధింపులు జరిగినా, ఏ వర్గాన్ని కించపర్చినా బాధితుల తరుపున తాము పోరాడుతామని అన్నారు. కాబట్టి దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. ‘‘రెజ్లర్లు ఇక్కడికి వచ్చి ధర్నాలో కూర్చోవడం దురదృష్టకరం. ఏ రంగులో ఉన్న ఏ ప్రభుత్వమైనా మహిళ చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి. విచారణ ముగిసే వరకు నిందితుడిని తొలగించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
కాగా.. కొంత సమయం తరువాత ఈ అంశంపై ప్రభుత్వం తరుఫున మధ్యవర్తిత్వం వహించడానికి రెజ్లర్ బబితా ఫోగట్ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయంపై నిష్పక్షపాత దర్యాప్తు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ‘‘బీజేపీ ప్రభుత్వం మల్లయోధులకు అండగా ఉంది. ఈ రోజే చర్యలు తీసుకునేలా చూస్తాను. నేను మొదట రెజ్లర్ ను. ప్రభుత్వంలో కూడా నేను ఉన్నాను. కాబట్టి మధ్యవర్తిత్వం వహించడం నా బాధ్యత. నా కెరీర్ లో కూడా వేధింపుల సందర్భాలు విన్నాను. నిప్పు లేనిదే పొగ లేదు. ఈ వాయిస్ చాలా ముఖ్యం’’ అని ఆమె అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రత నమోదు..
ఈ ఆరోపణలపై 72 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ)ని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోరింది. కాగా.. బీజేపీ ఎంపీ అయిన డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తనపై వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కొంతమంది రెజ్లర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మలిక్‌లు వారం రోజుల క్రితం తనను కలిశారని అన్నారు. ‘‘నేను అధ్యక్షుడిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు వారికి నచ్చకపోవచ్చు. కానీ నేను క్రీడల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆ నిర్ణయాలు తీసుకున్నాను’’ అని చరణ్ సింగ్ తెలిపారు.
