ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి జరిగిన అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్యపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే వారిని చంపేశారని, అప్పుడు జై శ్రీరాం నినాదాలు కూడా ఇచ్చారని ట్వీట్ చేశారు. యోగి ప్రభుత్వపు లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి ఇది సరైన ఉదాహరణ అని ఘాటుగా విమర్శించారు. 

హైదరాబాద్: అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ సోదరుడి హత్య పై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యోగి ప్రభుత్వపు అతిపెద్ద లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి ఇది నిదర్శనం అని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన అతీక్ అహ్మద్ హత్యపై స్పందించారు.

‘అతీక్, ఆయన సోదరుడు పోలీసు కస్టడీలో ఉండగానే చంపేశారు. వారి చేతికి బేడీలు ఉన్నాయి. అక్కడ జేఎస్ఆర్ (జై శ్రీరామ్) స్లోగన్స్ కూడా ఇచ్చారు. వారి హత్య యోగి ప్రభుత్వపు అతిపెద్ద లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి సరైన ఉదాహరణ. ఎన్‌కౌంటర్ రాజ్‌ను ప్రశంసిస్తున్న, సంబురపడుతున్నవారంతా ఈ హత్యకు సమానంగా బాధ్యులు అవుతారు.’ అని అసదుద్దీన్ ఒవైసీ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. మరో ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.

Also Read: Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హతం.. మీడియాతో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఫైరింగ్(video)

హంతకులను అభిమానించే సమాజంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉపయోగం ఏమిటీ అని ఆయన ప్రశ్నించారు.

Scroll to load tweet…

కాగా, ఆర్ఎల్ చీఫ్ జయంత్ సింగ్ ఈ ఘటన నమ్మశక్యం కావడం లేదన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సాధ్యమవుతాయా? అని సందేహం వ్యక్తీకరించారు.

Also Read: Atiq Ahmed: మీడియా ప్రతినిధులుగా హంతకుల మారువేషం.. అతీక్ అహ్మద్‌పై అతి సమీపం నుంచి ఫైరింగ్.. టాప్ పాయింట్స్

ఉత్తరప్రదేశ్ విపక్ష నేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పరాకాష్టకు చేరాయని ట్వీట్ చేశారు. నేరస్తుల ఆత్మవిశ్వాసం ఘనంగా ఉన్నదని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది రక్షణలో ఉన్నప్పుడే కాల్చి చంపేస్తున్నప్పుడు సాధారణ ప్రజల రక్షణ పరిస్థితేమిటీ అని ప్రశ్నించారు. ఈ ఘటన కారణంగా ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు నెలకొంటాయని వివరించారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు అనిపిస్తున్నదని తెలిపారు.