Asianet News TeluguAsianet News Telugu

Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హతం.. మీడియాతో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఫైరింగ్(video)

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ హతమయ్యాడు. మెడికల్ టెస్టుకు తీసుకెళ్లినప్పుడు ఇద్దరి నుంచి ముగ్గురు వ్యక్తులు అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వారిద్దరూ మరణించారు.
 

gangster atiq ahmed, his brother ashraf shot dead in prayagraj kms
Author
First Published Apr 15, 2023, 11:02 PM IST

లక్నో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడిపై ఈ రోజు బహిరంగంగా కాల్పులు జరిగాయి. వారు మీడియాతో మాట్లాడుతుండగానే అతి సమీపంగా కొందరు వ్యక్తులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో వారిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మెడికల్ టెస్టు కోసం వారిద్దరిని తీసుకెళ్లినప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. మెడికల్ టెస్టు కోసం వెళ్లి ఇంకా వారు ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీ ప్రాంగణం  దాటకముందే ఈ దాడి జరిగింది. వీరిద్దరిపై జరిగిన ఫైరింగ్ మీడియా లైవ్ టెలికాస్ట్‌లో రికార్డ్ అయింది. 

ఇద్దరి నుంచి ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్టు తెలిసింది. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లోని ధూమాన్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వారు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతుండగానే ఈ ఫైరింగ్ జరిగింది. అతీక్ అహ్మద్ తలకు సమీపంగా తుపాకీ ఎక్కుపెట్టి ఫైరింగ్ చేసినట్టు వీడియోలో కనిపిస్తున్నది. ఈ ఫైరింగ్ జరగ్గానే ఒక్కసారిగా అరుపులు కేకలు వినిపించాయి. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లు నేలకూలారు. వారు మీడియాతో మాట్లాడుతుండగానే ఫైరింగ్ జరగడంతో ఆ ఘటన మొత్తం వీడియోలో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

కాల్పులకు తెగబడిన వారి వివరాలేవీ తెలియరాలేదు. ఫైరింగ్ చేసిన ఒక నిందితుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు.

శనివారమే అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంతిమ సంస్కారాలకు హాజరుకావడానికి అనుమతించాలని అతీక్ అహ్మద కోరాడు. కానీ, ఆ అనుమతిని తిరస్కరించారు. కొడుకు అంతిమ క్రియలు జరిగిన గంటల వ్యవధిలోనే అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతమయ్యారు.

కొడుకు అసద్ అహ్మద్ మరణానికి తానే కారణం అసద్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిన తర్వాత అతీక్ అహ్మద్ బాధపడ్డాడు. కోర్టు ప్రాంగణంలోనే కన్నీరుమున్నీరయ్యాడు. అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ అహ్మద్ కూడా అసద్ మరణంపై బాధపడ్డాడు. దేవుడిచ్చిన బిడ్డను ఆ దేవుడే వెనక్కి తీసుకున్నాడని పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios