భాగస్వామి మార్ఫింగ్ ఫొటోలు అప్‌లోడ్.. కామెంట్లు చదివి తృప్తి చెందుతాడటా!
కర్ణాటకకు చెందిన వ్యక్తి తన భాగస్వామి మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఏమీ ఎరుగనట్టు గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. అసలు నిందితుడు ఆయనే అని తెలియవచ్చింది. ఆ ఫొటోల కింద వచ్చే కామెంట్లతో తృప్తి చెందుతాడని దర్యాప్తులో తేలింది.

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన భాగస్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ ఫొటోల కింద వచ్చే కామెంట్లు చదవడం తనకు చాలా ఇష్టమటా! ఆ కామెంట్లతో తాను తృప్తి చెందుతాడటా! ఆ వ్యక్తి తనతో సహజీవనంలో ఉన్న భాగస్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసి పలు సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. ఆమెదే కాదు.. ఆయన పలువురి బంధువుల మార్ఫింగ్ ఫొటోలనూ అప్‌లోడ్ చేశారు. ఈ విషయం బెంగళూరులో చోటుచేసుకుంది.
26 ఏళ్ల సంజయ్ కుమార్, 24 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‌తో సహజీవనంలో ఉన్నాడు. వీరిద్దరూ తమిళనాడులోని వెల్లూరుకు చెందినవారే. వారిద్దరూ పదో తరగతికి చెందినవారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఆమె ఫొటోలు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే.. అమిత్ షా రాష్ట్ర విలీనం వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్..
పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను ఆశ్రయించారు. ఆ ఫొటోలను తొలగించాలని, ఆ హ్యాండిల్స్ వివరాలు అందించాలని కోరారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ ఫొటోలను అప్‌లోడ్ చేసింది ఆమె బాయ్ ఫ్రెండ్ సంజయ్ కుమార్ అనే తేలింది. ఆమె ఫొటోలతోపాటు మరికొందరి బంధువుల ఫొటోలనూ మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేసినట్టూ బయటపడింది.
ఈ ఫొటోల కింద వచ్చే కామెంట్లతో ఆ వ్యక్తి తృప్తి చెందుతాడని పేర్కొంటూ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించారు.