Asianet News TeluguAsianet News Telugu

Farooq Abdullah | దేశ విభజనపై ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Farooq Abdullah: జ‌మ్మూకాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయడం, ఆ తర్వాత రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడ‌గొట్టిన త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థిత‌లు భిన్నంగా మారాయి. అక్కడి నేతలు కేంద్రంపై పలు విమర్శలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సోమవారం నాడు  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జాతీయ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా  దేశ విభ‌జ‌న పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. 
 

Partition of India a historic mistake: Farooq Abdullah
Author
Hyderabad, First Published Dec 13, 2021, 5:02 PM IST

Farooq Abdullah:  జ‌మ్మూకాశ్మీర్ నేత‌,  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జాతీయ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశ విభజన చారిత్రాత్మక తప్పిదమనీ, జమ్మూ కాశ్మీరీలే కాకుండా ముస్లిం సమాజం దాని భారాన్ని భరించాల్సి వచ్చిందని Farooq Abdullah అన్నారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఆ నేప‌థ్యంలోనే దేశ‌ విభజనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అలాగే,  మత ప్రాతిపదికన దేశ విభజన జరగకపోయి ఉంటే ఇరువర్గాలు శాంతియుతంగా సహజీవనం చేసేవార‌నీ,  అలాగే,  దేశం మరింత శక్తివంతంగా ఉండేదన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.  అలాగే,  ‘ఇది చాలా మంచి చర్య. అయితే ప్రధాని నరేంద్ర మోడీ  ఒక దేశానికి ప్రధానమంత్రి అయినందున అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.  ఎందుకంటే దేశంలో అనేక మతాలు ఉన్నాయి’ అన్నారు. అలాగే, కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను సైతం ఆయ‌న ప్ర‌స్తావించారు.  హిందూ, హిందుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై..  ‘మతాలు ఎప్పుడూ చెడ్డవి కావు. మనుషులు’ అని అంటూ Farooq Abdullah పేర్కొన్నారు. 

Also Read: పార్ల‌మెంట్‌లో CBSE ర‌గ‌డ‌.. క్షమాపణల‌కు సోనియా డిమాండ్ !

దేశంలో గ‌త కొన్నిరోజులుగా హిందువు, హిందుత్వ‌వాదులు అంశాల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో Farooq Abdullah స్పందిస్తూ.. ‘హిందూ కో అస్లీ హిందూ బన్నా చాహియే’ (హిందువు నిజమైన హిందువుగా మారాలి), వారి మతాన్ని అనుసరించాలని తాను ఆశిస్తున్నానని Farooq Abdullah  చెప్పారు. భార‌త దేశ విభ‌జ‌న వ‌ల్ల భార‌తీయ ముస్లీంలు న‌ష్ట‌పోవాల్సి వ‌స్తున్న‌ద‌ని అన్నారు.  భారత్‌-పాక్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు కూడా తలెత్తుతున్నాయని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. భారత్‌, పాకిస్థాన్‌లు ఒకే దేశంగా ఉంటే ఈ ఉద్రిక్తత నుంచి తప్పించుకునేవార‌ని పేర్కొన్నారు. 

Also Read: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !

ఇదిలావుండ‌గా, బంగ్లాదేశ్ విముక్తికి సాయుధ బలగాలు అందించిన సహకారాన్ని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియా గేట్ లాన్స్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి  చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఫ‌రూక్ అబ్దుల్లా పై వ్యాఖ్య‌లు చేశారు.  అంత‌కు ముందు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..  మత ప్రాతిపదికన దేశ విభజన ‘చారిత్రక తప్పిదం’ అని అన్నారు.  బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందే సమయంలో భారతదేశాన్ని మతం పేరుతో విభజించడం చారిత్రక తప్పిదమని 1971 యుద్ధం చూపించిందని చెప్పారు.  ఇదిలావుండగా  ఇటీవల జమ్మూకాశ్మీర్ రాజకీయాలు భిన్నంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి నేతలు జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను హరించిందనీ, తిరిగి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఫరూక్ అబ్దుల్లా  ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. మన హక్కులు తిరిగి పొందేందుకు ఢిల్లీ సరిహద్దులో రైతులు చేసిన విధంగా పోరాటం సాగించడంతో పాటు.. అన్నదాతలాగా త్యాగాలు  చేయాల్సి అవసరం  ఉంటుదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. 
Also Read: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !

Follow Us:
Download App:
  • android
  • ios