Asianet News TeluguAsianet News Telugu

Aadhaar-Voter ID link పై కాంగ్రెస్ ద్వంద వైఖ‌రి.. నెట్టింట్లో చుర‌క‌లు

ఓటరు ఐడీని ఆధార్​తో అనుసంధానం (Aadhaar-Voter ID link) చేసే బిల్లుకు లోక్​సభ ఆమోదం లభించింది. బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్‌ కార్డుతో అనుసంధానించేలా కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు విష‌యంలో కాంగ్రెస్ ద్వంద వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డంపై నెట్టింట్లో విమ‌ర్శ‌లు వెలువెత్తున్నాయి
 

Parties now opposing Election Laws (Amendment) Bill once sought the same
Author
Hyderabad, First Published Dec 21, 2021, 3:19 PM IST

భారత దేశంలోని ఎన్నికల వ్య‌వ‌స్థ‌లో కీలక సంస్కరణ చేసింది మోడీ ప్ర‌భుత్వం. బీజేపీ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. రానున్న ఎన్నిక‌ల్లో బోగ‌స్ ఓట్ల‌ను తొలగించ‌డ‌మే ల‌క్ష్యంగా.. ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం చేసేలా రూపొందించిన ఈ బిల్లుకు ఆమోదం ల‌భించింది.  అదే సమయంలో మరో మూడు అంశాల‌తో కూడిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021కు కూడా  లోక్ సభలో ఆమోదం లభించింది. 

అస‌లు సవరణ బిల్లు ఏంటీ? 

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, మెరుగైన ఓటింగ్ విధానాన్ని తీసుక‌రావ‌డం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడం, బోగస్‌ ఓట్లను తొలగించడం,  అలాగే.. కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించ‌డం వంటి ప‌లు లక్ష్యాల‌తో ఈ బిల్లును రూపొందించారు. అందులో భాగంగానే.. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. అయితే.. వ్య‌క్తి గ‌త గోప్య‌త‌కు భంగ‌వాటిల్ల కుండా చ‌ర్య‌లు తీసుకోవాలని, ఈ ప్ర‌క్రియ‌ను స్వ‌చ్చందంగా ప్ర‌జ‌లే అనుసంధానం చేసుకునే ఉండాల‌ని సుప్రీంకోర్టు సూచించిన‌ట్టు సమాచారం.

Read Also: 21 ఏళ్లు లేని వయోజన పురుషులు పెళ్లి చేసుకోలేరు.. కానీ సమ్మతించే భాగస్వామితో కలిసి జీవించొచ్చు.. హైకోర్టు
 
అయితే.. కాంగ్రెస్ తో సహా దాదాపు విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు చ‌ట్టంగా మారితే.. బడుగు, బలహీన, పేద వర్గాలకు చెందిన లక్షల మంది ఓటు హక్కు గల్లంతవుతుందని విపక్ష ఎంపీలు సభలోనే ఆరోపించారు. ఈ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఈ క్ర‌మంలో ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021ని తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడం ఆధార్ చట్టానికి వ్య‌తిరేకమ‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అంతేకాకుండా.. ఆధార్ డేటాతో వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం వాటిల్లుతోందని ఆరోపించింది. ఈ విష‌యం అనేక సంద‌ర్బాల్లో నిరూపించ‌మైంద‌ని ఆరోపించారు.  ఓట‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారం పార్టీల చేతుల్లోకి వెళ్లిపోతుంద‌ని అన్నారు. ఓటర్ ఐడీకి ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఓటర్ ప్రొఫైలింగ్ ఆధారంగా  ప్రచారం నిర్వ‌హించే అధికారముంద‌ని, ఇది రాజ్యాంగం విరుద్ద‌మ‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.

Read Also: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటోపై సవాల్... పిటిషనరుకు లక్షరూపాయల జరిమానా..

ఆగస్ట్ 27, 2018 న ఏం జ‌రిగిందో ప‌రిశీలిద్దాం...
 
వివిధ ఎన్నికల సంస్కరణల గురించి చర్చించడానికి జాతీయ, రాష్ట్ర  రాజకీయ పార్టీలతో న్యూఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది భారత ఎన్నికల సంఘం .  ఈ స‌మావేశంలో మొత్తం ఏడు జాతీయ పార్టీలు, 34 పాంత్రీయ పార్టీలు హాజరయ్యాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా  ఓటర్ల వివరాలతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. దీనివల్ల ఓటర్ల జాబితా మెరుగ్గా నిర్వహించబడుతుందని అన్ని రాజ‌కీయ పార్టీలు  పేర్కొన్నాయి. ఇదే విష‌యాన్ని 2018 లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో కాంగ్రెస్ ముందుకు తీసుక‌వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నకిలీ ఓటింగ్‌ను ఎదుర్కోవడానికి ఆధార్ కార్డును ఓటర్ ఐడితో అనుసంధానం చేయాలని కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ OP రావత్‌ను సంప్రదించింది. పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. 

Read Also: వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు

కానీ,  గ్రెస్ తన ద్వంద్వ వైఖ‌రితో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2018లో ఈ బిల్లును తీసుక‌రావాల‌ని డిమాండ్ చేసిన కాంగ్రెసే .. ఇప్ప‌డూ వ‌ద్ద‌ని నిర‌స‌లు వ్య‌క్తం చేయ‌డ‌మేంట‌నీ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంలో ఇత‌ర‌ ప్రతిపక్షాలకు కాంగ్రెస్ ను విమ‌ర్శిస్తోన్నాయి. ఒకప్పుడు.. ఈ బిల్లును తీసుక‌రావాల‌ని ప్ర‌తిపాద‌న‌లు చేసిన మీరు.. ఇప్పుడు వ్య‌తిరేకించ‌మేమిట‌నీ ప్ర‌శ్నిస్తోన్నారు. అలాగే.. ఒకే స్టాండ్ పై నిల‌బడాల‌ని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే కాంగ్రెస్ ఈ బిల్లును వ్య‌తిరేకిస్తోంద‌ని విమ‌ర్శించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios