Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటోపై సవాల్... పిటిషనరుకు లక్షరూపాయల జరిమానా..

ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద కేరళ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో పిటిషన్ వేసిన పిటిషనరుకు లక్షరూపాయల జరిమానాను హైకోర్టు విధించింది. ఈ పిటిషన్ చిన్న పిల్లతనం, రాజకీయంగా ప్రేరేపితమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ మీద హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 

kerala high court dismisses plea challenging pm modi's pic on covid vaccination certificate penalises petition
Author
Hyderabad, First Published Dec 21, 2021, 2:09 PM IST

కేరళ : covid Vaccination Certificatesపై ప్రధానమంత్రి Narendra Modi చిత్రం ముద్రించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను Kerala High Court కొట్టివేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద కేరళ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కోర్టులో పిటిషన్ వేసిన పిటిషనరుకు లక్షరూపాయల జరిమానాను హైకోర్టు విధించింది. ఈ పిటిషన్ చిన్న పిల్లతనం, రాజకీయంగా ప్రేరేపితమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ మీద హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉండగా, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటో ఉంటే త‌ప్పేంటి అని కేర‌ళ హైకోర్టు డిసెంబర్ 13న ప్ర‌శ్నించింది. ఆయ‌న ఇప్పకీ భార‌త దేశ ప్ర‌ధానే క‌దా అని తెలిపింది. క‌రోనా వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో ఉండ‌టాన్ని స‌వాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సోమ‌వారం డిసెంబర్ 13న కేర‌ళ హైకోర్టులో వాద‌న‌లు కొన‌సాగాయి. ఈ సంద‌ర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. 

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటో ఉంటే తప్పేంటి- కేరళ హైకోర్టు

కేర‌ళ‌కు చెందిన పీటర్ మైలిపరంపిల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ పివి కున్హికృష్ణన్ విచారించారు. పిటిష‌నర్ త‌ర‌ఫు లాయ‌ర్ వాద‌న‌లు వినిపిస్తూ.. ‘‘తన పిటిషనర్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల కోసం డబ్బులు చెల్లించారు, అయినా ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో వచ్చింది. దీంతో పాటు ఆ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌లో సొంత అడ్ర‌స్ అని పేర్కొని ఉంది. ఇది వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌ల్గించే అంశం’’ అని తెలిపారు. ప్ర‌ధాని ఫొటోలేని వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ కావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా అని పిటిష‌న‌ర్ ను న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. 

పిటిష‌న‌ర్ నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో న్యాయ‌మూర్తి అసంతృప్తికి గుర‌య్యారు. ఇది కేవ‌లం కోర్టు స‌మ‌యాన్ని వృథా చేసేందుకు వేసిన పిటిష‌న్ అని భావించారు. ‘‘దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ లో ప్ర‌ధాని ఫొటో ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది క‌నిపించ‌లేదు. కానీ మీకే ఎందుకు ప్ర‌ధాని ఫొటో ఉండ‌టం త‌ప్పుగా క‌నిపిస్తోంది’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రధానిని చూసి పిటిషనర్ ఎందుకు సిగ్గుపడుతున్నారు ? ఎవ‌రికైనా రాజ‌కీయంగా భిన్న అభిప్రాయాలు ఉండ‌వ‌చ్చ‌ని, కానీ న‌రేంద్ర మోడీ మ‌న ఇప్ప‌టికీ దేశానికి ప్ర‌ధానమంత్రే’’ అని న్యాయమూర్తి అన్నారు. 

కాగా, పీఎం కేఆర్ అండ్ ట్రస్ట్, దాని అధికారిక వెబ్‌సైట్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ కూడా బాంబే హైకోర్టు ముందుకొచ్చింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచార‌ణ చేపట్టింది. ఈ అంశంపై స‌మాధానం చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాని ఆదేశించింది. ఈ కేసు ‘‘చాలా ముఖ్యమైనది’’గా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంపై సమాధానం చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ను ఆదేశించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి  రెండు వారాల సమయం కోరారు. కాగా ఈ పిటిష‌న్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన విక్రాంత్ చవాన్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios