Asianet News TeluguAsianet News Telugu

21 ఏళ్లు లేని వయోజన పురుషులు పెళ్లి చేసుకోలేరు.. కానీ సమ్మతించే భాగస్వామితో కలిసి జీవించొచ్చు.. హైకోర్టు

దేశంలో మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ సాగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్, హర్యానా హైకోర్టు (Punjab and Haryana high court) గత వారం ఇచ్చిన ఓ తీర్పు హాట్ టాపిక్‌గా మారింది.

Adult Male Under 21 Cant Marry But Can Live With Consenting Partner says Punjab Haryana HC
Author
Chandigarh, First Published Dec 21, 2021, 3:05 PM IST

దేశంలో మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ సాగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్, హర్యానా హైకోర్టు (Punjab and Haryana high court) గత వారం ఇచ్చిన ఓ తీర్పు హాట్ టాపిక్‌గా మారింది. 21 ఏళ్లలోపు ఉన్న వయోజన పురుషుడు (adult male).. 18 ఏళ్లు పైబడిన మహిళతో పెళ్లి చేసుకోకుండా ఆమె సమ్మతి ఉంటే కలిసి జీవించవచ్చని హైకోర్టు తెలిపింది. పంజాబ్‌లో గురుదాస్‌పూర్ జిల్లాలోని సహజీవనం చేస్తున్న ఓ జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

హైకోర్టును ఆశ్రయించిన జంట.. తమ బంధంపై ఇరు కుటుంబాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్టుగా తెలిపింది. ఈ క్రమంలోనే.. ‘ప్రతి పౌరుడి జీవితం, స్వేచ్ఛను రక్షించడం రాజ్యాంగ బాధ్యతల ప్రకారం ప్రభుత్వం యొక్క బాధ్యత యొక్క విధి. పిటిషినర్ 2(పురుషుడు) వివాహ వయస్సులో లేరనేది.. రాజ్యంగం ప్రకారం భారత పౌరులుగా ఉన్న పిటిషనర్ల ప్రాథమిక హక్కును హరించేది కాదు’ అని జస్టిస్ హర్నరేష్ సింగ్ గిల్ వ్యాఖ్యానించారు.

దంపతుల అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్న న్యాయమూర్తి హర్నరేష్ సింగ్ గిల్..  వారికి రక్షణ కల్పించాలని గురుదాస్‌పూర్ ఎస్‌ఎస్పీని ఆదేశించారు. ఇక, వయోజన జంటకు వివాహం చేసుకోకుండా కలిసి జీవించవచ్చని 2018 మే నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. 

ఇక, భారతదేశంలో లివ్-ఇన్ సంబంధాలను నియంత్రించే చట్టాలు లేవు.. అయినప్పటికీ అవి చట్టవిరుద్ధం కాదు. Khushboo v. Kanaimmal and Anr కేసులో.. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కలిసి జీవించడం అనేది జీవించే హక్కు అని పేర్కొంది. అందువల్ల.. సమాజం అనైతికంగా పరిగణించబడుతున్నప్పటికీ సహజీవనం చట్టం దృష్టిలో నేరం కాదు. ఇక, భారత్‌లో పురుషులకు కూడా వయోజన వయసు 18 ఏళ్లు.

Follow Us:
Download App:
  • android
  • ios