న్యూఢిల్లీ:మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ అస్త్రాన్ని ఎంచుకొంది. నాగ్‌పూర్ లో ఇప్పటికే లాక్ డౌన్ విధించింది.మరో రెండు జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది.

మహారాష్ట్రలోని అకోలా, షర్భణి జిల్లాల్లోనూ మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. పుణెలో మాత్రం రాత్రి పూట కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకొంది.పుణెలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున కర్ప్యూను విధించారు. అంతేకాదు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని  కూడ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

also read:కరోనా కేసుల ఉధృతి: నాగ్‌పూర్‌లో మళ్లీ లాక్‌డౌన్

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు  వ్యాక్సినేషన్ పై కేంద్రీకరించాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్  అధికారులను ఆదేశించారు.పుణెలో ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలు ముసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని 10, 12 తరగతుల విద్యార్ధులకు మినహాయింపు ఇచ్చినట్టుగా అధికారులు తెలిపారు.

ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నామని  అధికరాులు ప్రకటించారు.హోటల్స్, రెస్టారెంట్లు, 50 శాతం సామర్ధ్యంతోనే నడపాలని అధికారులు సూచించారు.