Asianet News TeluguAsianet News Telugu

కరోనా కేసుల ఉధృతి: నాగ్‌పూర్‌లో మళ్లీ లాక్‌డౌన్

కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతుండడంతో నాగ్‌పూర్ లో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది.ఈ నెల 15 నుండి మార్చి 21 వరకు లాక్‌డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
 

Nagpur Lockdown From March 15-21, Essential Services To Continue lns
Author
Nagpur, First Published Mar 11, 2021, 2:15 PM IST

ముంబై: కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతుండడంతో నాగ్‌పూర్ లో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది.ఈ నెల 15 నుండి మార్చి 21 వరకు లాక్‌డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల బూత్ ల వంటి వాటికి లాక్‌డౌన్ నుండి మినహాయించారు.నెల రోజుల నుండి మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఉద్దవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకొన్నారు.

నాగ్‌పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.మహారాష్ట్రలోని  అత్యధికంగా కేసులు నమోదౌతున్నాయి. ప్రతి రోజూ 13,659 కేసులు చోటు చేసుకొన్నాయి. ప్రతి రోజూ 60 శాతం కేసులు నమోదయ్యాయి.  

దేశంలోని మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న రాష్ట్రంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తోంది.నాగ్‌పూర్ లో ఒక్క రోజులోనే 1710 కేసులు వెలుగు చూశాయి.  173 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులో నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

దేశంలోని మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. మహారాష్ట్రకు సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios