పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఈ నెల 20న సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు..?
ఈనెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పెండింగ్‌లో వుంది మహిళా రిజర్వేషన్ బిల్లు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంత ఉన్నపళంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు అంటూ పెద్ద ఎత్తున చర్చల జరుగుతోంది. దేశం పేరును మార్చనున్నారా లేక ఉమ్మడి పౌర స్మృతి తీసుకొస్తారా అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈనెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పెండింగ్‌లో వుంది మహిళా రిజర్వేషన్ బిల్లు.
అంతకుముందు పార్లమెంట్‌లో మోడీ మాట్లాడుతూ.. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు.
Also Read: పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం.. చరిత్రను గుర్తుచేసుకున్న మోదీ.. కీలక పాయింట్స్ ఇవే..
ఈ సందర్భంగా చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు మనలో అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందని అన్నారు. 75 ఏళ్లలో అనేక ఘట్టాలకు వేదికగా నిలిచిందని చెప్పారు. ఈ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో విభేదాలు, వివాదాలను మనందరం చూశామని.. అయితే అదే సమయంలో కుటుంబ భావనను కూడా చూశామని చెప్పారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
తాను ఎంపీగా తొలిసారిగా ఈ భవనం (పార్లమెంట్)లోకి అడుగుపెట్టినప్పుడు.. ప్రజాస్వామ్య దేవాలయానికి నమస్కరించి, గౌరవించానని చెప్పారు. ఇది తనకు ఉద్వేగభరితమైన క్షణమని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నివసించే వ్యక్తి.. పార్లమెంటులో ప్రవేశించగలరని తాను ఊహించలేదని చెప్పారు. తాను ప్రజల నుంచి ఇంత ప్రేమను పొందుతానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.