India Pakistan: అణుబాంబులున్నాయని బెదిరిస్తూ వచ్చిన పాకిస్తాన్.. యుద్ధ విరామం కోసం అమెరికా కాళ్లుపట్టుకుందాం? దీని వెనుక అసలు కథ వేరే ఉంది! పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
India Pakistan: తన దగ్గర అణుబాంబులున్నాయనీ, అవసరమైతే వాడతామని బెదిరిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి యుద్ధ విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది చాలా మందికి అనుమానంగా ఉంది. ఇప్పుడు భారత్‌పై అణుబాంబులు ప్రయోగించమని పాకిస్తాన్ ప్రధాని చెప్పారు. కానీ అసలు కథ వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. అణుబాంబుల గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్, శాంతి చర్చల కోసం అమెరికా కాళ్లుపట్టుకుంది. అసలు ఏం జరిగింది?
ఆదివారం పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ స్థావరంపై భారత్ దాడి చేసింది. నూర్ ఖాన్ వాయు స్థావరం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది పాకిస్తాన్లో చాలా ముఖ్యమైన వాయు స్థావరం. భారత సైన్యం పాకిస్తాన్‌లోని చాలా వాయు స్థావరాలపై దాడి చేసింది. దీని గురించి పాకిస్తాన్ సైన్యం కూడా చెప్పింది.
ఈ దాడిలో భారత్‌కు కావాల్సిన ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ దాడి సమయంలో చిన్న భూకంపం కూడా వచ్చిందని సమాచారం. దీంతో పాకిస్తాన్ భయపడిపోయింది. భారత్‌తో గొడవ పెట్టుకుంటే తనకు మనుగడ ఉండదని అర్థమై, అమెరికా కాళ్లు పట్టుకుని యుద్ధ విరామం కోసం అభ్యర్థించిందని తెలుస్తోంది.
చైనా ఉపగ్రహ సంస్థ MIZAZVISION విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలను చూస్తే, భారత్ దాడి తర్వాత నూర్ ఖాన్ వాయు స్థావరం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. క్షిపణి దాడి వల్ల పెద్ద శబ్దం వచ్చిందని, తర్వాత పొగ, మంటలు కనిపించాయని చెప్పారు. మొదట ఒక పేలుడు, తర్వాత మరో పేలుడు జరిగిందని, రెండో పేలుడు తర్వాత వాళ్ళు బయటకు పరిగెత్తారని, వాయు స్థావరం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయని చెప్పారు. కానీ భారత్ ఈ స్థావరంపై అలా దాడి చేయలేదు. అక్కడ భారత్‌కు కావాల్సిన ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది.
దీనికి తోడు భారత్ దాడులను ఎదుర్కొవడంలో పాక్ సక్సెస్ కాలేకపోయింది. భారత్ తో కాల్పుల విరామం లేకుంటే తమ దగ్గర ఉన్న బాంబులను ఇక్కడే పేలవచ్చని పాక్ భయపడిందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికాను బేరాల కోసం భారత్ వద్దకు పంపి.. పాకిస్తాన్ తన వక్రబుద్దిని చూపిస్తూ రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తోంది. మొత్తంగా భారత్ తన వ్యూహాల్లో తీసుకున్న మార్పులతో పై చేయి మనదనే చెప్పాలి. ఉగ్రవాద దాడులు అంటే భారత్ పై యుద్ద చర్యగా పరిగనిస్తామని మోడీ సర్కారు హెచ్చరించింది. అలాగే, భారత సైన్యం సైతం మరోసారి భారత్ పై దాడులు చేస్తే పాకిస్తాన్ కు ఏం జరుగుతుందో తెలుస్తుందని మాస్ వార్నింగ్ ఇచ్చింది.


