ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ( UP elections 2022) సమీపిస్తున్నకొద్దీ పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష‌ల మ‌ధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఈ త‌రుణంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై  ఉత్తరప్రదేశ్ పంచాయితీ రాజ్ మంత్రి భూపేంద్ర సింగ్ చౌదరిసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యోగి ఆదిత్యనాథ్ అధికారాన్ని నిలుపుకుంటే ఒవైసీ హిందువులు ధరించే పవిత్రమైన జంధ్యం ధరిస్తారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ( UP elections 2022) సమీపిస్తున్నకొద్దీ పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రోజురోజుకూ ప‌రిణామాలు మారుతున్నాయి. తాజాగా.. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తూ.. యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

యూపీలో బీజేపీ విజ‌యం సాధించి.. యోగి ఆదిత్యనాథ్ మరోసారి యూపీ సీఎం అయితే.. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే జంధ్యాన్ని(యజ్ఞోపవీతం) AIMIM నేత ఒవైసీ ధరించి, రామనామాన్ని జపిస్తారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి ఒక అజెండా ఉందని, ఆ అజెండా ప్ర‌కారమే తాము ముందుకు వెళ్తున్నామని భూపేంద్ర వ్యాఖ్యానించారు. ఈ అజెండా ప్ర‌కారమే.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిత్యం హనుమాన్ ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నార‌ని అన్నారు. ఈ అజెండా వ‌ల్లే కాంగ్రెస్ ప్ర‌ధాన నాయ‌కుడు రాహుల్ గాంధీ జంధ్యాన్ని(యజ్ఞోపవీతం) ధరించి, తన గోత్రం చెప్ప‌డ‌టం ప్రారంభించార‌ని చెప్పారు. తన అజెండా కారణంగానే .. ప్ర‌తిప‌క్ష నేత‌లు వాళ్ల సొంత అజెండాలను పక్క‌కు పెట్టి.. మ‌రీ బీజేపీ అజెండాల‌ను పాటిస్తున్నార‌ని అన్నారు.

Read Also: Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!

ఇక, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేప‌ట్టితే.. రాహుల్, అభిలేశ్ ల మారిదిగానే త‌మ అజెండాను అనుస‌రిస్తార‌ని, హిందువుల పవిత్రంగా భావించే.. జంధ్యాన్ని ధ‌రించి.. రాముడి నామాన్ని జపించడం ప్రారంభిస్తారని భూపేంద్ర సింగ్ చౌదరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేవలం మైనార్టీల గురించి మాత్రమే మాట్లాడేవారు, రాముడు అనే వ్యక్తి కేవలం ఒక ఊహాజనిత వ్యక్తి గా భావించే వాళ్లు కూడా జంధ్యాన్ని ధరించి, దేవాలయాలను సందర్శిస్తారని భూపేంద్ర అన్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో బీజేపీ క‌చ్చితంగా విజ‌యం సాధిస్తున్న‌ద‌ని, యోగి మరోసారి సీఎం అవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. దీంతో ఒవైసీ జంధ్యాన్ని ధరిస్తారని జోస్యం చెప్పారు. 

Read Also: ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఇదిలా ఉంటే.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ( UP elections 2022) మొత్తం 403 స్థానాలకు గాను ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పలు స్థానిక పార్టీలతో పొత్తు ఉంటుందా లేదా అన్నది కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల్లో గెలుపు మాత్రం తథ్యమని ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఈ ఎన్నిక‌ల్లో ఎంఐఎం ప్ర‌ధానంగా దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల బరిలో దిగుతోంది. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా వాటా ఈ రెండు సామాజిక వర్గాలదే. దీంతో మజ్లిస్ ఒంటరిగా పోటీ చేయ‌డానికే సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్నిక‌లు స‌మీస్తున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ.. త‌న పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను అధికార బీజేపీ హ్యాక్ చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత రోజే.. సమాజ్ వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త పియూష్ జైన్ పై దాడులు జ‌ర‌గడం పెద్ద మొత్తంలో డ‌బ్బు సీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం.