Coronavirus: 400 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా.. బడ్జెట్ సమావేశాలు జరిగేనా?
Coronavirus: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. కరోనా పంజాతో నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదిలావుండగా, మరికొన్నిరోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగున్నాయి... అయితే, 400 మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడటం కలకలం రేపుతున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రభావం పడే అవకాశం కన్పిస్తున్నది.
Coronavirus: భారత్ కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర భయాందోళలు రేపుతున్నది. నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమోదుకావడంతో పాటు మరణాలు సైతం క్రమంగా పెరుతున్నాయి. దీనికి తోడూ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ Coronavirus ఒమిక్రాన్ సైతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలాంటి పరిస్థితులు ఉండగా, మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) ప్రారంభం కానున్నాయి. ఇలాంటి తరుణంలో పార్లమెంటు సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడిన విషయానికి సంబంధించి అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం.. పార్లమెంట్ లో పనిచేస్తున్న వారిలో చాలా మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు హోం క్వారంటైన్ లో ఉండగా, మరికొంత మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వీరందరికీ ఒమిక్రాన్ సోకిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఓ జాతీయ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఉన్నతాధికారులు.. పార్లమెంట్‌లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది Coronavirus బారినపడ్డారు. పార్లమెంటులో మొత్తం 1,409 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 400 మందికి కరోనా వైరస్ బారినపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అయితే, వీరికి కొత్తగా వెలుగుచూసిన.. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ అయిన ఒమిక్రాన్ సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారినపడ్డ వారి నమునాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపినట్లు వెల్లడించారు. ఈ నాలుగు వందల మంది ఈ నెల 4 నుంచి 8 మధ్యనే కరోనా వైరస్ బారినపడ్డారని అధికారులు పేర్కొన్నారు. Coronavirus సోకిన పార్లమెంట్ సిబ్బందిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
దీంతో ఇటీవల కరోనా పాజిటివ్ గా తేలిన సిబ్బందిని కలిసిన వారిలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఉన్నతాధికారులు సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగున్నాయ. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడటం.. Parliament Budget Session సమావేశాలపై ప్రభావం చూపే అవకాశం కన్పిస్తున్నది. దీనికి తోడూ దేశంలో కరోనా బారినపడుతున్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుత Coronavirus పరిస్థితులను గమనిస్తే... దేశం మళ్లీ లాక్‌డౌన్ లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు దేశంలోని కరోనా పరిస్థితులపై ఉన్నత అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,59,377 మందికి Coronavirus సోకింది. రోజువారీ కేసులు లక్ష దాటిన రెండు రోజుల్లోనే 1.5 లక్షలకు చేరుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. Covid-19 సేకండ్ వేవ్ సమయంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ.. 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తంCoronavirus మరణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది.