జాతీయ ప్రయోజనాలే మా విదేశాంగ విధానం: ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో మోడీ

గత పదేళ్లకు ముందున్న పరిస్థితి ఇప్పటి పరిస్థితిపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  స్పందించారు. ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కు  మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు.  

Our Nation is on the Cusp of a take off  Says Narendra modi lns

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  భారత దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.  అయితే ఇందుకు ప్రజల భాగస్వామ్యం  ముఖ్యంగా పని చేసిందని  ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు  ఇంటర్వ్యూ ఇచ్చారు.  పదేళ్లలో  దేశ ప్రగతితో పాటు  విదేశాంగ విధానంపై  వివరంగా మాట్లాడారు. 

భారత దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత ప్రజల ఆకాంక్షలు పదేళ్ల క్రితంతో పోలిస్తే  ప్రస్తుతం భిన్నంగా ఉన్నాయన్నారు. మన దేశం ప్రగతి పథంలో  మరింత ముందుకు  దూసుకుపోబోతుందని  ప్రజలు గుర్తిస్తున్నారని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలనే ఆకాంక్షలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారని  మోడీ చెప్పారు.  ఉత్తమ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ప్రజలకు తెలుసునని మోడీ  తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యం ముఖ్యం

రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించలేమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు.  స్వచ్ఛ భారత్  దేశ వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణ ప్రచారం నుండి ప్రజలకు మౌళిక వసతుల సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం అనేక  ముందుందని  మోడీ చెప్పారు. దాదాపు  1 బిలియన్ మందిని ఆన్ లైన్ లోకి తీసుకు వచ్చినట్టుగా చెప్పారు. ప్రజల భాగస్వామ్యం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.

జాతీయ ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రం

భారత  జాతీయ ప్రయోజనాలే  తమకు అత్యంత ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహరాల్లో ఈ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకుంటామని  ప్రధాని చెప్పారు. ఖలీస్తాని ఉగ్రవాది  గురుపత్ వంత్ సింగ్ పన్నూన్ హత్యకు  కుట్ర పన్నడంతో  భారత్ పై అమెరికా చేసిన ఆరోపణలపై ఇరు దేశాల మధ్య సంబందాలపై  ప్రధాని నరేంద్ర మోడీ  తొలి సారిగా స్పందించారు.  భారత్, అమెరికా మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.  

ఇజ్రాయిల్ -హమాస్ వివాదంపై  ప్రధాని మోడీ స్పందించారు. తాను ఈ ప్రాంత నాయకులతో టచ్ లో ఉన్నట్టుగా చెప్పారు. శాంతి దిశగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి భారత దేశం ఏం చేయాలో అది కచ్చితంగా అమలు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 

తయారీ రంగంలో  భారత్ దూసుకెళ్తుంది.

భారత ఆర్ధిక ప్రగతి చైనా కంటే వేగంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చెప్పారు. చాలా కంపెనీలు చైనాను వదిలి భారత దేశానికి వస్తున్నాయని  ప్రధాని మోడీ వివరించారు. భఆరత్ ను చైనాతో కాకుండా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చడం సరైంది కాదన్నారు. వ్యాపారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు  ఆసక్తితో ఉన్నారని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు. 

తమ ప్రభుత్వంపై  విపక్షాలు  ప్రతి రోజూ విమర్శలు చేస్తున్నాయన్నారు. తమపై విమర్శలు చేసే వారిపై అణచివేస్తున్నామనే  ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.  స్వేచ్ఛగా తమపై  విపక్షాలు  ఆరోపణలు చేస్తున్నాయన్నారు. 

సోషల్ మీడియా, టీవీ చానెల్స్, ఇతర ప్రసార సాధనాల్లో  తమ ప్రభుత్వంపై  ఆరోపణలు చేస్తున్నారన్నారు.  అలా చేసేందుకు వారికి హక్కుందన్నారు. కానీ వాస్తవాలతో ప్రతిస్పందించేందుకు  ఇతరులకు కూడ సమాన హక్కుందని మోడీ పేర్కొన్నారు. 

 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios