Asianet News TeluguAsianet News Telugu

మోర్బీ వంతెన ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం.. ప్రధానిని టార్గెట్ చేస్తూ పాత వీడియోలు షేర్ చేస్తున్న నాయకులు

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రతిపక్షాలు బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కోల్ కత్తాలో బ్రిడ్జి కూలిన సమయంలో ప్రధాని నరేండ్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నాయి. 

Oppositions anger over Morbi bridge incident. Leaders sharing old videos targeting Prime Minister
Author
First Published Oct 31, 2022, 1:35 PM IST

గుజరాత్ బ్రిడ్జి కూలి 130 మందికి పైగా మరణించిన ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట పశ్చిమ బెంగాల్‌లో వంతెన కూలిన తర్వాత ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు, విమర్శకులు షేర్ చేస్తూ ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. దీంతో ఆ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. 

కేరళ మర్డర్ కేసులో ట్విస్ట్ : పెళ్లైతే చనిపోతాడని జోస్యం... ప్రియుడికి కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చి హత్య..

‘‘పశ్చిమ బెంగాల్ లో వంతెన కూలిపోయినప్పుడు ప్రధాని చేసిన ‘దేవుని చర్య లేదా మోసపూరిత చర్య (యాక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్) అనే ప్రసంగం నాకు గుర్తుకు వస్తోంది. ఆయన సెన్సివిటీ కారణంగా నేను ఆ వీడియోను షేర్ చేయడం లేదు. అది అంత సున్నితంగా , అజాగ్రత్తగా ఉంది’‘ అని  శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.

అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా ప్రధానిపై విమర్శలు చేశారు. ‘‘మోడీజీ, మోర్బీ బ్రిడ్జి ప్రమాదం దేవుడి చర్యా లేక మోసం వల్ల జరిగిందా? ’’ అంటూ 2016 సంవత్సరంలో ప్రచురితం అయిన ఓ వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. కోల్ కతా వంతెన కూలిపోయిన సమయంలో మోడీ చెప్పినట్టుగా డబ్బులో లాభాల కోసం నిర్మాణ నాణ్యతలో రాజీపడటం వల్లనే ఈ విపత్తు సంభవించిందని ఆయన ఆరోపించారు. ‘ఇది దేవుడి చర్య కాదని, ఇది మోసపూరిత చర్య’ అని పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోడీ గతంలోనే చెప్పారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు 

గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం : 141కి చేరిన మృతులు.. రాజ్ కోట్ ఎంపీ ఫ్యామిలీలో 12మంది మృతి..

మరో కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా కూడా ఈ ఘటనపై బీజేపీకి  పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ ఇది నేరపూరిత కుట్ర కాదా.. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే బ్రిడ్జిని ప్రజల వినియోగానికి తెరిచేందుకు బీజేపీ ప్రభుత్వం ఎలా అనుమతించింది.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకముందే ఓట్లు దండుకోవాలనే తొందరలో బీజేపీ ప్రభుత్వం ఇలా చేసిందా ? రాష్ట్ర ప్రభుత్వం వంతెన మరమ్మతు పనిని కంపెనీ లేదా ట్రస్ట్‌కి ఎలా ఇచ్చింది? వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయా ? దీనిపై సీఎం భూపేంద్ర పటేల్.. స్థానిక మంత్రి ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు? గుజరాత్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెత్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే వారు నిర్మించిన వంతెన కూలిపోవడం బాధాకరమని అన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ 2016లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందు బ్రిడ్జి కూలిపోయినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు.

కాగా.. 2016 సంవత్సరం మార్చి నెలలో కోల్ కతాలో వివేకానంద రోడ్ లో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది చనిపోయారు. కొంత కాలం తరువాత ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ లోని ఓ సభలో టీఎంసీని విమర్శించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సమయంలోనే యాక్ట్ ఆఫ్ గాడ్ వంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పుడు ప్రధాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వాటినే ఆయనపైకి విమర్శనాస్త్రాలుగా ప్రతిపక్ష నాయకులు ఎక్కుపెడుతున్నారు. 

నిజాయితీ చాటుకున్న శ్రీలంక తమిళ శరణార్థి.. రోడ్డుపై దొరికిన రూ. 40 వేలను తిరిగి ఇచ్చిన మహిళ..

ఆ సమయంలో పశ్చిమ బెంగాల్లోని మదరీహాట్ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన మోడీ.. వంతెన కింద చిక్కుకున్న ప్రజలకు మెరుగైన సహాయక చర్యలను ప్రారంభించడానికి , వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడానికి బదులు.. బెంగాల్ ముఖ్యమంత్రి ఆ నిందను తనపైకి రాకుండా వామపక్ష పార్టీలపైకి మళ్లించారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios