Asianet News TeluguAsianet News Telugu

కేరళ మర్డర్ కేసులో ట్విస్ట్ : పెళ్లైతే చనిపోతాడని జోస్యం... ప్రియుడికి కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చి హత్య..

కేరళలో షారాన్ యువకుడి మృతి మిస్టరీని పోలీసులు చేధిస్తున్నారు. ప్రియురాలే హత్య చేసినట్టు ఒప్పుకుంది. అయితే దీని వెనుక ఆమె కుటుంబసభ్యుల హస్తం కూడా ఉందని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Girlfriend says she plotted crime alone In Sharon murder case,  doctors report turned crucial
Author
First Published Oct 31, 2022, 1:27 PM IST

తిరువనంతపురం : తిరువనంతపురంలోని పరస్సాలలో షారన్ రాజ్ అనే యువకుడు మృతి మిస్టరీగా మారింది. అతని మరణం వెనకున్న రహస్యాన్ని చేధించేందుకు వైద్యుల నివేదిక పోలీసులకు కీలకంగా మారింది. ఆదివారం నాడు, షారోన్‌కు అతని స్నేహితురాలు గ్రీష్మ విషమిచ్చి చంపినట్లు దర్యాప్తు బృందం నిర్ధారించింది.

పోలీసులకు ఇచ్చిన నివేదికలో... చనిపోయేముందు షారాన్ వాంతులు చేసుకున్నాడు. ఆ వాంతులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయని డాక్టర్ పేర్కొన్నాడు. సాధారణంగా, ఒక వ్యక్తి కాలేయం లేదా మూత్రపిండాలను దెబ్బతీసే విష పదార్థాన్ని తీసుకుంటే వాంతులు లేదా మూత్రం ముదురు రంగులోకి మారుతుంది. ఏడీజీపీ ఎంఆర్‌ అజిత్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం డాక్టర్‌ రిపోర్టును పరిశీలించి.. షారోన్‌ తాగిన పానీయంలో నిందితులు కపిక్‌ అనే హెర్బిసైడ్‌ కలిపినట్లు నిర్ధారించారు. షరోన్ శరీరంపై కాపర్ సల్ఫేట్ కంటెంట్ కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు.

గ్రీష్మా ఇంటి నుంచి కపిక్ బాటిల్‌ను కూడా దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలను నిర్ధారిస్తామని ఏడీజీపీ తెలిపారు. కాగా, షారోన్‌ను అంతమొందించేందుకు తానే ఒంటరిగా ప్లాన్ వేసినట్లు నిందితురాలు గ్రీష్మ పేర్కొంది. కానీ, ఆమె మాటలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో గ్రీష్మా తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపించింది.

గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం : 141కి చేరిన మృతులు.. రాజ్ కోట్ ఎంపీ ఫ్యామిలీలో 12మంది మృతి..

విచారణలో, షరాన్ తనతో సంబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతో చంపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది. ఇలా కేసు చుట్టూ ఎన్నో చిక్కుముళ్లు ఉన్నాయి. వీటిని ఛేదించడానికి తదుపరి దర్యాప్తు అవసరం అని దర్యాప్తు బృందం అంటోంది.

తనను మొదటిసారి పెళ్లి చేసుకునే వ్యక్తి నవంబర్ నాటికి చనిపోతాడని ఒక జ్యోతిష్యుడు జోస్యం చెప్పాడని గ్రీష్మా షారోన్‌తో చెప్పింది. కానీ షరాన్ అలాంటి విషయాలు తాను నమ్మనని తేల్చి చెప్పేశాడు. వీరిద్దరూ గత ఏడాదిగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే షారోన్‌ను అంతమొందించేందుకే గ్రీష్మా జ్యోతిష్య శాస్త్రం అంటూ కథలల్లిందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఫిబ్రవరిలో తాను షరోన్‌తో విడిపోయానని గ్రీష్మా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. కానీ షరాన్ మాత్రం గ్రీష్మను వదులుకోవడానికి సిద్దంగా లేడు. అందుకే ఆమెతో పదే పదే కలవడానికి ప్రయత్నించేవాడు. దీంతో అతడిని ఇంటికి ఆహ్వానించి విషం కలిపిన పానీయం ఇవ్వాలనుకుంది. అలాగే చేసింది. అయితే అది తాగిన తరువాత, ఏదో తేడాగా ఉందని అతను చెప్పాడు. వెంటనే ఆమె మరో పళ్లరసం అతనికి ఇచ్చింది. అది తాగిన వెంటనే షారన్ వాంతులు చేసుకున్నాడు. షారోన్ గ్రీష్మ ఇంటికి వెళ్లినప్పుడు షరాన్ స్నేహితుడి కూడా అతనితో ఉన్నాడు. వచ్చారు. 

అయితే, షారోన్ తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం.. గ్రీష్మను కలిసిన ప్రతీసారి.. ఇంటికి వచ్చాక షారోన్ కడుపునొప్పితో బాధపడేవాడని.. జ్యూస్ తాగిన తరువాత వాంతులు చేసుకునేవాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే గ్రీష్మ ఈ ఆరోపణను తోసిపుచ్చింది. షరాన్‌తో తన వివాహంపై వచ్చిన ఆరోపణలను కూడా ఆమె తిరస్కరించింది. ఈ పెళ్లిపై సమగ్ర విచారణ జరుపుతామని ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. అదే సమయంలో, షారోన్ కుటుంబం దర్యాప్తులో అలసత్వం అంటూ పరస్సాల పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కుటుంబీకుల కథనం ప్రకారం, హత్య అనే అనుమానాస్పద ఆరోపణలను కొట్టిపారేయడం ద్వారా పరస్సాల పోలీసులు గ్రీష్మాకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించారని అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios