Operation Sindoor: 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు గతంలో భారత్ చేపట్టిన ఇతర మిషన్ల పోలిస్తే ఆపరేషన్ సింధూర్ చాాలా భిన్నమైంది.
ఆపరేషన్ సింధూర్: భారత్ లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ను ప్రారంభించింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే.. పాక్ కు ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2016లో ఉరి సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ వైమానిక దాడి జరిగాయి. అయితే.. వారితో పోల్చితే.. ఆపరేషన్ సింధూర్ భిన్నమైనది.
గతంలో భారత్ .. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులకు మాత్రమే పరిమితం. ఆపరేషన్ సింధూర్ మాత్రం భారత్ ఇప్పటివరకు చేపట్టిన ఏ మిషన్ కంటే భిన్నమైనది. బాలాకోట్ తర్వాత భారత్ చేపట్టిన అతిపెద్ద సరిహద్దు దాటి దాడి ఇది. పాకిస్తాన్, దానికి మద్దతు ఇచ్చే ఉగ్రవాదులకు ఊహించని షాక్ ఇచ్చింది. భారత్ తో పెట్టుకుంటే కష్టమే అనేలా చేసింది.
లక్ష్యాల ఎంపిక
ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ప్రాంతాలపై భారత సైన్యం దాడి చేసింది. ముజఫరాబాద్, కోట్లీ, బహవల్పూర్, రావల్‌కోట్, చక్‌సవారీ, భీంబర్, నీలం లోయ, జీలం, చక్వాల్ ఆకస్మిక దాడులు జరిగాయి. 24 క్షిపణులతో దాడి చేయగా.. 70కి పైగా మంది ఉగ్రవాదులు మరణించారనీ, 60 మందికి పైగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యాలను ఎంచుకున్నారు. సాటిలైట్ ఫోటోస్, భారత నిఘా సంస్థలు సమాచారంతో జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఎ-తొయిబా (LeT) స్థావరాలను గుర్తించినట్టు తెలుస్తోంది.
ఆయుధాలు
ఆపరేషన్ సిందూర్ లో భారత దేశ త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. SCALP క్రూయిజ్ క్షిపణులు, HAMMER బాంబులు, లోయిటరింగ్ మందుగుండు సామగ్రిని వాడారు. భారత వైమానిక దళ యుద్ధ విమానాలు భారత గగనతలంలో ఉండి క్షిపణులు, బాంబులు ప్రయోగించాయి. .
ఇందులో వాటిని SCALP క్షిపణి చాలా ప్రత్యేకమైంది. దీని పరిధి 400 కి.మీ. బంకర్లు, కమాండ్ పోస్టుల వంటి కఠిన లక్ష్యాలపై వీటిని ఉపయోగించారు. బహుళ అంతస్తుల భవనాలపై HAMMER బాంబులు వేశారు. కమకాజీ డ్రోన్లను కూడా ఉపయోగించారు. డ్రోన్ల సహాయంతో దాడి వీడియోను కూడా తీశారు.
ఉగ్ర స్థావరాలపై దాడి
1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్- జైష్-ఎ-మొహమ్మద్
2. మర్కజ్ తైబా, మురీద్కే - లష్కర్-ఎ- తొయిబా
3. సర్జల్, తెహ్రా కలాన్ - జైష్-ఎ-మొహమ్మద్
4. మహమూనా జోయా, సియాల్‌కోట్ - హర్కత్-ఉల్-ముజాహిదీన్
5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా- లష్కర్-ఎ- తొయిబా
6. మర్కజ్ అబ్బాస్, కోట్లీ - జైష్-ఎ-మొహమ్మద్
7. మస్కర్ రాహిల్ షాహిద్, కోట్లీ - హర్కత్-ఉల్-ముజాహిదీన్
8. షావాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ - లష్కర్-ఎ- తొయిబా
9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జైష్-ఎ-మొహమ్మద్