న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టుఅయోధ్య విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పును ఇచ్చినట్టుగా ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ చెప్పారు.శనివారం నాడు అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మీడియాతో మాట్లాడారు.

also read:రామ మందిర నిర్మాణానికి అనుకూలం: కాంగ్రెస్

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. ప్రజలంతా ఈ తీర్పుపై  సంయమనం పాటించాలని  మోహన్ భగవత్ సూచించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని  ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కోరారు.సుప్రీం కోర్టు తీర్పును గెలుపు, ఓటములుగా చూడవద్దని మోహన్ భగవత్ సూచించారు.సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్య వివాదం ముగిసిందని  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. 

also read:ayodhya verdict: అయోధ్య తీర్పు.. బాబ్రీ యాక్షన్ కమిటీ అసంతృప్తి

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

also read:Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

 అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , లైవ్ అప్ డేట్స్

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పుపై  స్పందించిన విషయం తెలిసిందే. 

సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.