Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. 

ayodhya verdict live updates are here

వివాదాస్పద అయోధ్య  వివాదం నేటితో ముగియనుంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసు తుది తీర్పును ఈ రోజు వెల్లడించనున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ తోపాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా న్యాయస్థానానికి చేరుకునున్నారు. తీర్పు చదివేందుకు అరగంట సమయం పడుతుందని న్యాయమూర్తి చెప్పారు.

 అయోధ్యలోని వివాదస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రశస్తే లేదని తేల్చి చెప్పింది. మూడునెలల్లో అయోధ్య ట్రస్ట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించింది.

మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం

కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలే సున్నీ వక్ఫ్ బోర్డుకి స్థలం కేటాయించాలి.

1993 ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకి స్థలమివ్వచ్చు.

వివాదాస్పద స్థలాన్ని రామజన్మ భూమి న్యాస్ కు అప్పగించిన సుప్రీం కోర్టు
 

ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు

అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయింపు

స్థలాన్ని సున్నీ బోర్డుకు అప్పగించాలి.

దేవాలయాన్ని ధ్వంసం చేసారనడానికి పురావస్తు ఆధారాలు ఏమీ లేవు.

12-16 శతాబ్దాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాలు ఏమీ లేవు.

బాబ్రీ మసీదు కింద భారీ నిర్మాణం ఉంది. పురావస్తు శాఖ నివేదికను ఊహాజనితమని కొట్టిపారేయలేం.

యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉుందని హిందువులు విశ్వసిస్తున్నారు. రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవి. రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారు. 

పురావస్తు పరిశోధనలను చూస్తే 12వ శతాబ్దంలోనే ఆలయం ఉంది.

బాబ్రీ మసీదుకు ముందు ఇస్లామిక్ నిర్మాణాలేమీ లేవు.

పురావస్తు శాఖ అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదుని కట్టలేదు.

నిర్మోహి అఖాడా పిటిషన్ కూడా కొట్టేసిన సుప్రీం కోర్టు

నిర్మోహి పిటిషన్ కు కాలం చెల్లిందని చీఫ్ జెస్టిస్ అన్నారు.

బాబ్రీ మసీదుని కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో కచ్చితమైన ప్రాతిపదిక లేదని చెప్పారు.

బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మించినట్లు తెలుస్తోందన్నారు.మత గ్రంథాలను బట్టి కోర్టు తీర్పు ఉండదన్నారు.

ఇది ఐదుగురు న్యాయమూర్తులు కలిసి తీసుకున్న ఏకగ్రీవ తీర్పు అని  స్పష్టం చేశారు

.షియా బోర్డు పిటిషన్ ని కొట్టివేశారు.వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్ కూడా కొట్టేశారు.

చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడిస్తున్నట్లు చెప్పారు.

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios