Asianet News TeluguAsianet News Telugu

రామ మందిర నిర్మాణానికి అనుకూలం: కాంగ్రెస్

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం నాడు కీలక తీర్పును వెలువరిచింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తాము అనుకూలమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Ayodhya verdict: Congress says it is in favour of Ram temple construction
Author
New Delhi, First Published Nov 9, 2019, 1:09 PM IST


న్యూఢిల్లీ:  రాముడిని రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అభిప్రాయపడ్డారు.

also read:ayodhya verdict: అయోధ్య తీర్పు.. బాబ్రీ యాక్షన్ కమిటీ అసంతృప్తి

శనివారం నాడు అయోధ్యలో వివాదాస్పద స్థలంపై  సుప్రీంకోర్టు తీర్పును వెలువరిచిన తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

రాముడిని రాజకీయాలకు వాడుకోవాలనే బీజేపీ సహా ఇతర పార్టీలకు సుప్రీంకోర్టు తలుపులు మూసివేసిందని  ఆయన అభిప్రాయపడ్డారు. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిన్యాస్‌కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం నాడు తీర్పును చెప్పింది.

also read:Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. తీర్పు వెలువడిన కొద్దిసేపటి తర్వాత రణదీప్ సుర్జేవాలా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. 

also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , లైవ్ అప్ డేట్స్

శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , లైవ్ అప్ డేట్స్

 అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పుపై  స్పందించిన విషయం తెలిసిందే. 

సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios