జైపూర్: నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు. ఇది  సరైందే, కానీ, రాజస్థాన్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనమయ్యారు.  ఇది ఎలా తప్పని రాజస్ధాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు.

టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైన సమయంలో బీజేపీ వాదన ఏమైందన్నారు. రాజ్యసభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని విలీనం చేసిన సమయంలో  నోరు మెదపని వారు... కాంగ్రెస్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు విలీనం కావడం ఎలా తప్పన్నారు.

also read:మూడోసారి గవర్నర్ నుండి ఆశోక్ గెహ్లాట్‌కు చుక్కెదురు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నో

వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ అంగీకరించారు. ఆగష్టు 14వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా  గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రకటించారు.

సచిన్ పైలెట్ కు 19 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. అయితే ఇప్పటికే కనీస మెజారిటీకి  ఒక్క ఎమ్మెల్యేనే ఆశోక్ గెహ్లాట్ వర్గానికి ఎక్కువగా ఉన్నారు.  దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు ఆశోక్ గెహ్లాట్ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.

తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను క్యాంపుకు పంపారు గెహ్లాట్. ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని గెహ్లాట్ ఆరోపించిన విషయం తెలిసిందే.