జైపూర్: అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ చేసిన వినతిని మూడోసారి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తిరస్కరించారు.

ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ విషయంలో కల్ రాజ్ మిశ్రా గెహ్లాట్ వినతిని గవర్నర్ తిరస్కరించారు. బుధవారం నాడు మూడోసారి కూడ తోసిపుచ్చారు.

also read:రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలకు ఒకే: గవర్నర్ మెలిక ఇదీ..

ఈ నెల 31వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ ను కోరుతూ కేబినెట్ సిఫారసు చేసింది. అయితే సిఫారసును ఆయన తిరస్కరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై 21 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని గవర్నర్ రెండు రోజుల క్రితం సీఎం రాసిన లేఖకు సమాధానంగా లేఖ పంపారు.

అసెంబ్లీ సమావేశాల్లో భౌతిక దూరం ఎలా పాటిస్తారని కూడ ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. గవర్నర్ లేఖ పంపిన తర్వాత మూడోసారి కూడ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయమై గెహ్లాట్ రాసిన లేఖపై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొనేందుకు ఆశోక్ గెహ్లాట్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీని సమావేశపర్చాలని  కోరుతున్నారు.  సచిన్ పైలెట్ వర్గం వైపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆలస్యమైతే మరికొందరు ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉందని భావిస్తున్న గెహ్లాట్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు.