Omicron in Hyderabad: హైదరాబాద్ లో ఒమిక్రాన్ టెన్ష‌న్ .. క్ర‌మంగా పెరుగుతోన్న కేసులు

Omicron  in Hyderabad:  హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. అయితే ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు ఆస్పత్రి నుంచి పారిపోయారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
 

Omicron found in Hyderabad

Omicron in Hyderabad: ప్ర‌పంచ దేశాల‌ను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ‌ణికిస్తోంది. గ‌త ఏడాదికి పైగా  విజృంభించిన క‌రోనా ఇప్పుడిప్పుడే.. త‌గ్గుతోంది, మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితుల వ‌చ్చాయ‌ని భావిస్తోన్న తరుణంలో.. ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ దేశాలు భయాందోళ‌న చెందుతున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. ప్రపంచ దేశాల‌కు క్ర‌మంగా పాకుతోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.  

తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అలాగే..ఢిల్లీలో నాలుగు, రాజస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో కేంద్ర‌, రాష్ట్రాలు అల‌ర్ట్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

ఈ క్ర‌మంలో  తెలంగాణలోకి కూడా ఒమిక్రాన్ ప్రవేశించింది. హైదరాబాద్ లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. డిసెంబర్ 12 న కెన్యా నుంచి వచ్చిన 24 ఏండ్ల మహిళకు ఒమిక్రాన్ ఉన్న‌ట్టు గుర్తించ‌మని , అలాగే. సోమాలియా నుంచి వచ్చిన మరో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 

Read Also: TSRTC: ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఆర్టిసి బస్సు దగ్దం... మావోయిస్టుల పనేనా?

ఈ ఇద్ద‌రూ కూడా  నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారేనని.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించినట్లు శ్రీనివాస్ చెప్పారు. సీక్వెన్సింగ్‌లో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ఈ క్ర‌మంలో ఒమిక్రాన్ వచ్చిన వ్యక్తులు పారిపోయారని.. పోలీసులు వెతికి పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలోని బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌తో తప్పిపోయిన సోమాలియన్‌ను బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు ఆస్పత్రి నుంచి పారిపోయారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

Read Also: రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్న వైఎస్ శర్మిల.. ఈ నెల 19 నుంచి ప్రారంభం

దీంతో తెలంగాణ స‌ర్కార్ అల‌ర్ట్ అయింది.  ఒమిక్రాన్ వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు డీహెచ్ తెలిపారు. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగిందని వెల్లడించారు. భారత్ లో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో 57 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. తాజాగా కేసుల‌తో ఈ సంఖ్య 3. ఇటు ఏపీలోనూ మూడు రోజుల క్రితం ఒక ఒమిక్రాన్ కేసు న‌మోదయ్యాయి. పదిరోజుల క్రితం విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గుర్తించారు. ట్రీట్‌మెంట్ తర్వాత అతనికి నెగిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios