కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో వేగంగా వ్యాపిస్తోంది. తాజా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ఈ మహమ్మారి వ్యాప్తిచెందిన రాష్ట్రాల సంఖ్య 21కి చేరింది.  

హైదరాబాద్: ఇప్పటికే కరోనా ఫస్ట్ (corona first wave), సెకండ్ వేవ్ (corona second wave) నానా భీభత్సం సృష్టించగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) రూపంలో థర్డ్ వేవ్ (corona third wave) మొదలయ్యింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా న్యూ వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది. ఇలా భారత్ (india) కు కూడా చేరుకున్న ఈ మహమ్మారి రాష్ట్రాలకు వ్యాపిస్తూ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653 కు చేరింది.

దేశంలోని 21 రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దేశ రాజధాని న్యూడిల్లీలో 165, కేరళ 57, తెలంగాణ 55, గుజరాత్ 49, రాజస్థాన్ 46, తమిళనాడు 34, కర్ణాటక 31 కేసులు నమోదయ్యాయి. ఇక మధ్య ప్రదేశ్ 9, ఒడిషా 8, ఆంధ్ర ప్రదేశ్ 6, పశ్చిమ బెంగాల్ 6, హర్యానా 4, ఉత్తరాఖండ్ 4, చత్తీస్ ఘడ్ 3, జమ్మూ కాశ్మీర్ 3, ఉత్తర ప్రదేశ్ 2, గోవా 1, హిమాచల్ ప్రదేశ్ 1, లడక్ 1, మణిపూర్ 1 ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది.

ఇలా ఇప్పటికవరకు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవగా వీరిలో 186మంది ఇప్పటికే కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 61మంది కోలుకోగా రాజస్థాన్ 30, న్యూడిల్లీలో 23, తమిళనాడు 16, కర్ణాటక 15, తెలంగాణ 10, గుజరాత్ 10మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

read more తెలంగాణలో ఒమిక్రాన్ సెకండ్ కాంటాక్ట్ మొదటి కేసు.. ప్రమాదం అంటున్న వైద్యులు..

జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లదక్ లో ఒమిక్రాన్ బారినపడినవారంతా కోలుకున్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి యాక్టివ్ ఒమిక్రాన్ కేసులేవీ లేనట్లే. మిగతా రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ బారినపడినవారు వేగంగా కోలుకుంటున్నారు. 

ఇదిలాఉంటే దేశంలో సాధారణ క‌రోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,358 కేసులు నమోదయ్యాయి. కేసుల కంటే ఎక్కువగా 6,450 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 75,456 యాక్టివ్ కేసులు వున్నాయని వెల్లడించారు. దేశంలో రికవరీ రేట్ 98.40శాతంగా వుంది. 

ఇదిలావుంటే తెలంగాణలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు విదేశాల నుండి వచ్చినవారిలోనే ఒమిక్రాన్ బయటపడగా తాజాగా వారిద్వారా ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్స్ కు కూడా వైరస్ వ్యాపిస్తోంది. ఇలా దుబాయ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricilla district)లో మరో ముగ్గురికి ఒమిక్రాన్ సోకింది. దీంతో ఈ ఒక్క జిల్లాలోనే 4ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

read more Omicron: కేర‌ళ‌లో ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

ఇటీవల దుబాయ్ (dubai) నుండి వచ్చిన పిట్ల రాంచంద్రం అనే వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. దీంతో అతడిని హైదరాబాద్ (hyderabad) లోని టిమ్స్ (TIMS) కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే అతడి కుటుంబసభ్యులతో పాటు స్నేహితులక కూడా వైద్యసిబ్బంది టెస్టులు చేసారు. ఈ క్రమంలోనే రాంచంద్రం తల్లి దేవమ్మ, భార్య మౌనిక, స్నేహితుడు హనుప అంజయ్య కు కరోనా పాజిటివ్ తేలింది. వారి నుండి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెల్ పరీక్ష చేయగా ముగ్గురికీ ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే ఈ ముగ్గురిని వైద్యంకోసం హాస్పిటల్ కు తరించి చికిత్స అందిస్తున్నారు.