Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఒమిక్రాన్ సెకండ్ కాంటాక్ట్ మొదటి కేసు.. ప్రమాదం అంటున్న వైద్యులు..

తాజాగా ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయింది. పట్టణంలోని వైరా రోడ్డులో ఓ అపార్ట్మెంట్ లో నివసించే 21 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.  ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మంలో తన ఇంటికి వచ్చిన యువతికి జలుబు, దగ్గు ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేసుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది.  

omicron new variant second contact first case detects in hyderabad, dengerous saying doctors
Author
Hyderabad, First Published Dec 27, 2021, 12:12 PM IST

హైదరాబాద్ : రాష్ట్రంలో omicron కరోనా వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. ఇటీవల ఒక విదేశీయుడు నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కు ఒమిక్రాన్ సోకగా ఆదివారం ఫలితాల్లో ఆ వైద్యుడి wifeకు సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి second contact కు కూడా వ్యాపించినట్టు తేలింది.  ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు.

ఆ డాక్టర్ భార్యతో సహా ఆదివారం రాష్ట్రంలో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ Quarantine లో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.  ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలో ఒకరు సోమాలియా దేశస్థుడు కాగా మరొకరు కెన్యా వ్యక్తి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 44కు పెరిగింది.  ఇందులో పదిమంది  రికవర్  అయ్యారు. 

 ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 248 మంది రాగా వీరిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.  ఈ ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్  ఉందా?  లేదా?  గుర్తించేందుకు ప్రయోగశాలకు వీరి నమూనాలను పంపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 109 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,662కు  పెరిగింది. కరోనాతో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం నాలుగు వేల 22 మంది మృతి చెందారు. 

తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా ముగ్గురికి పాజిటివ్, 44కి చేరిన మొత్తం కేసులు

కాగా, తాజాగా ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయింది. పట్టణంలోని వైరా రోడ్డులో ఓ అపార్ట్మెంట్ లో నివసించే 21 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.  ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మంలో తన ఇంటికి వచ్చిన యువతికి జలుబు, దగ్గు ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేసుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది.  అయితే ఒమిక్రాన్ లక్షణాలు కూడాకనిపించడంతో హైదరాబాద్ వైరాలజీ ల్యాబ్ కు శాంపిల్స్ పంపగా ఒమిక్రాన్ అని తేలింది. వెంటనే యువతిని అధికారులు హైదరాబాద్లోని కిమ్స్ కు తరలించారు.

కాగా, దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ (omicron) తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన బాధితుల సంఖ్య 44కి చేరింది. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 248 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి (shamshabad airport) చేరుకున్నారు.

వారందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వీరిలో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో తెలంగాణలో (telangana) ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 44కి చేరింది. ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 11,493 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios