కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో నెమ్మదిగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron Cases In India) పెరుగుతుంది. తాజాగా భారత్‌లో మరో 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో నెమ్మదిగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron Cases In India) పెరుగుతుంది. తాజాగా భారత్‌లో మరో 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 4, రాజస్తాన్‌లో 4 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిసి delhiలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కి చేరింది. rajasthanలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13కి చేరింది. 

ఇప్పటివరకు దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులు మహారాష్ట్రలో వెలుగుచూశాయి. ఇక్కడ ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 20కి చేరాయి. ఇక, రాజస్థాన్‌లో 13, గుజరాత్ 4, కర్ణాటక 3, ఢిల్లీలో 6, ఛండిగ‌ఢ్ 1, కేరళ 1, ఏపీలో 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

ఇక, భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో మొత్తం 5,784 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల న‌మోదులో 21 శాతం మేర త‌గ్గాయి. ప్ర‌స్తుత కేసుల‌తో క‌లుపుకుని భార‌త్ లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,47,03,644కు చేరాయి. ఇదే స‌మ‌యంలో మొత్తం 7,995 మంది క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 3,41,38,763కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం భారీగా త‌గ్గాయి. 90 వేల దిగువ‌కు క్రియాశీల కేసులు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 88,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ మొత్తం 252 మంది మరణించారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,75,888 చేరింది.