సారాంశం
ఒలింపియన్ మహిళా రెజ్లర్ ఫోటోను మార్ఫింగ్ చేసి.. వీడియో రూపొందించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
హర్యానా : ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఓ వ్యక్తి ఏకంగా ఒలింపియన్ మహిళా రెజ్లర్ ఫోటోనే మార్ఫింగ్ చేశారు. ఈ మార్ఫింగ్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశాడు. హర్యానాకు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో అతను సర్క్యులేట్ చేస్తున్న 30 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో.. ఉన్నది మహిళా రెజ్లర్ కాదు. ఆమెకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి నిందితుడు వీడియో క్లిప్ లో వాడుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.
సంవిధాన్ సదన్‌గా పాత పార్లమెంటు భవనం: పేరు ప్రతిపాదించిన ప్రధాని మోడీ
దీనిమీద రెజ్లర్ తండ్రి జింద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హిసార్ జిల్లాకు చెందిన నిందితుడు అమిత్‌ని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 30 సెకన్ల నిడివి గల వీడియోలో నిందితుడు రెజ్లర్ మార్ఫింగ్ చేసిన ఫోటోను ఉపయోగించాడు. వీడియో క్లిప్ లో ఉన్నది వేరే పురుషుడు, మహిళ.
‘‘ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా అందులో తనతోపాటు ఉన్నది తన స్నేహితురాలని సదరు రెజ్లర్ కాదని స్పష్టం చేశాడు. తానెప్పుడూ ఆ రెజ్లర్ ను కలవలేదని తెలిపాడు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలో ఉన్న రెజ్లర్ వీడియో నిజం కాదని తెలిపారు”అని పోలీసు అధికారి తెలిపారు.
నిందితుడి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. మంగళవారం కోర్టులో రిమాండ్‌ని తీసుకుని విచారిస్తామని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అతడిపై కేసు నమోదు చేశారు.