Asianet News TeluguAsianet News Telugu

ఇక మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు.. మార్చి - ఏప్రిల్ లో ప్రారంభించేందుకు అధికారుల సన్నాహకాలు

మరి కొన్ని నెలల్లో మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇందులో 8 కోచ్ లు ఉంటాయి. తక్కువ రద్దీ ఉండే మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది. 

Officials are preparing to start Mini Vande Bharat Express trains in March-April
Author
First Published Jan 25, 2023, 1:32 PM IST

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. దీంతో రాబోయే నెలల్లో మరిన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అయితే వాటి కంటే ముందుగా ఈ రైళ్లలో మినీ వర్షన్ ను తయారు చేయాలని భావిస్తోంది.  అయితే వీటిని ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రైళ్లను మార్చి - ఏప్రిల్ నెలల్లో ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పైలట్ విజయవంతమైతే భారతీయ రైల్వేలు మినీ రైళ్లను దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వివరాలు ఇవే..

వందే భారత్ పూర్తి రైలులో 16 కోచ్ లు ఉంటాయి. అయితే మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గా పిలుస్తున్న ఈ రైళ్లలో 8 కోచ్ లు ఉండనున్నాయి. అయితే కొన్ని నిర్దిష్ట మార్గాల్లో ఈ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగితే మరిన్ని కోచ్‌లను జోడించే అవకాశం ఉంది. అయితే ఈ మినీ రైళ్లు అందుబాటులోకి వస్తే ఢిల్లీ మెట్రోకు కొంత సారూప్య నమూనగా కనిపిస్తాయి.

901 మంది పోలీసులకు అవార్డులు: ఏపీ, తెలంగాణ పోలీసులకు ప్రెసిడెంట్ మెడల్స్

ప్రస్తుతం ఉన్న రైళ్లల్లో సమయాభారాన్ని తగ్గించడమే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ల ప్రాథమిక లక్ష్యం. ప్రస్తుతం ఉన్న రైళ్లలో 6-7 గంటల ప్రయాణ సమయాన్ని ఈ రైళ్లు 4-5 గంటలకు తగ్గిస్తాయి. అమృత్‌సర్-జమ్ము, రూట్ కాన్పూర్-ఝాన్సీ రూట్ నాగ్‌పూర్-పూణే మార్గం వంటి ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉండే చిన్న విభాగాలలో ఈ రైళ్లను నడపాలని రైల్వే యోచిస్తోంది.

రిపబ్లిక్ డే వేడుక‌లు: ఉగ్రదాడి బెదిరింపులు.. ఢిల్లీలో పరేడ్ మార్గంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త

మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తక్కువ మార్గాల్లోనే పరిమితం అయినప్పటికీ ప్రయాణీకులకు హై-స్పీడ్ రైళ్లకు ప్రాప్యతను పెంచుతుంది. ఈ మినీ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలకు ఆదాయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం 8 కోచ్ రైళ్ల రూపకల్పన, సీటింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. పెద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios