రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసులకు అవార్డులను ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 901 మందికి కేంద్ర హోంశాఖ పలు అవార్డులను ప్రకటించింది.
న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశంలోని 901 మంది పోలీస్ సిబ్బందికి పోలీస్ పతకాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ.
సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గరిష్టంగా 48 గ్యాలంట్రీ అవార్డులను దక్కించుకున్నారు. మహరాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న 31 మంది , జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 25 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు దక్కించుకున్నారు. ఢిల్లీ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు పోలీసులు అవార్డులు పొందారు.
140 మందికి శౌర్య అవార్డులను కేంద్రం ప్రకటించింది. అయితే లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన పోలీస్ సిబ్బందితో పాటు జమ్మూ కాశ్మీర్ లో పనిచేసిన సిబ్బందికి ఈ అవార్డులు దక్కాయి. లెఫ్ట్ వింగ్ ప్రాంతాల్లో పనిచేసిన 80 మందితో పాటు జమ్మూకాశ్మీర్ లో పనిచేసిన 45 మందికి ఈ అవార్డులు దక్కాయి.
2021 లో మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని పొటెగావ్ -రాజోలి మధ్య జరిగిన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మహిళలు సహ 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో పాల్గొన్నా ఎలైట్ కమాండోల బృందంలోని 19 మంది అధికారులకు గ్యాలంట్రీ అవార్డులు దక్కాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు పోలీసు అధికారులకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుండి అనిల్ కుమార్, బృంగి రామకృష్ణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ దక్కాయి. ఏపీలో అతుల్ సింగ్ , సంఘం వెంకట్రావుకు పోలీస్ మెడల్స్ వరించాయి. ఏపీలో 12 మందికి మెరిటోరియస్ సర్వీసెస్ మెడల్స్ దక్కాయి
